న్యూయార్క్‌లో దురదృష్టకర ప్రమాదం: ఆంధ్రా టెక్కీ మృతి.. మృతదేహం లభ్యం

Update: 2022-10-18 05:06 GMT
విహార యాత్ర కాస్తా విషాదంతో ముగిసింది. ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృత్యుఒడికి చేరుకున్నాడు. విజయవాడ పోరంకి వసంత్ నగర్ కాలనీకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి (35) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. తాజాగా జలపాతంలో కొట్టుకుపోయిన ఆయన మృతదేహం దొరకడంతో దాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఎన్నారై నెక్కలపు హరీష్ చౌదరి అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఘోర జలపాత ప్రమాదంలో మృతిచెందడం స్థానిక విజయవాడలో విషాదం నింపింది. కెనడాలో నెక్కెలపు హరీష్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసి   టూల్ మేకర్‌గా పనిచేస్తున్నాడు. యుఎస్ - కెనడాలో పండుగల సీజన్ అయినందున, అతను తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ సందర్శించాడు. దురదృష్టవశాత్తు ఆ యాత్ర హరీష్‌కు ప్రాణాంతకంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  న్యూయార్క్‌లోని ఫ్లేక్ స్ట్రీట్‌లోని ఇతాకా వాటర్‌ఫాల్స్‌ను హరీష్‌ మరో నలుగురు స్నేహితులతో కలిసి మంగళవారం సందర్శించారు. హరీష్ జలపాతం బేస్ పైకి ఎక్కుతుండగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయాడు.

హరీష్ కోసం చాలా మంది నీటిలో వెతికారు. ఎట్టకేలకు అతడి డెడ్ బాడీ దొరికింది.  ఇతడిని నీటిలో నుండి బయటకు తీసి  ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో నీటిలో పడి మునిగిపోవడంతో గాయాలపాలైన ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణా జిల్లా లంకపల్లి గ్రామానికి చెందిన హరీష్ (35). గత ఎనిమిదేళ్లుగా కెనడాలో ఉంటూ ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విజయవాడ పోరంకికి చెందిన సాయి సౌమ్యతో వివాహం జరిగింది. చిన్న వయసులోనే హరీష్ మరణం ఇప్పుడు విషాదం నింపింది.

హాస్యాస్పదంగా, హరీష్ ప్రకృతి ప్రేమికుడని.. ఆ ప్రకృతిలోనే కలిసిపోయాడని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  హరీష్ ఆకస్మిక మరణంతో అతని కుటుంబం.. స్నేహితులు అందరూ శోకంలో ఉన్నారు. ఇతను కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ఉన్నాడు. తానా, అతని స్నేహితులు , సన్నిహిత కుటుంబ సభ్యులు Gofundme.comలో నిధుల సమీకరణను ప్రారంభించారు. సేకరించిన డబ్బు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఉపయోగించబడుతుంది. మిగిలినది అంత్యక్రియలు పూర్తి చేయడానికి కుటుంబానికి ఇవ్వబడుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News