బీకాంలో కెమిస్ట్రీ.. ‘ఏయూ’ తప్పులు

Update: 2018-06-24 04:46 GMT

బీకాంలో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యేను చూశాం కానీ.. నిజంగానే సైన్స్ సబ్జెక్ట్ చదివిన  విద్యార్థికి బీకాం సర్టిఫికెట్ జారీ చేసి ఆంధ్రా యూనివర్సిటీ అభాసుపాలైంది. దశాబ్ధాల చరిత్రగల ఆంధ్రా యూనివర్సిటీలో నెలకొన్న ఈ నిర్లక్ష్యం ఓ విద్యార్థి పాలిట శాపంగా మారింది.

ఈనెల 18న ఏయూ పరీక్షల విభాగం జారీ చేసిన ఓ ఒరిజినల్ ధృవపత్రంలో తప్పు దొర్లింది. డిగ్రీలో సైన్సు సబ్జెక్ట్ చదివిన ఓ విద్యార్థికి బీకాం డిగ్రీ చదువు పూర్తి చేసినట్టు ధృవపత్రాన్ని అందజేసింది. పార్ట్ 1లో ఆంగ్లం - తెలుగు - హెచ్ సీ సబ్జెక్టులు - పార్ట్ 2లో కెమిస్ట్రీ - బోటనీ - జువాలజీ సబ్జెక్టులు పాస్ అయినట్లు పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేశారు.  ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు.. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు - సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి.

సదురు సైన్స్ విద్యార్థి తన డిగ్రీ సర్టిఫికెట్ చూశాక కానీ తప్పు జరిగిన విషయాన్ని గుర్తించలేదు. యూనివర్సిటీ అధికారులను సంప్రదించగా.. వారు గుట్టుగా ఈ ధ్రువీకరణ పత్రాన్ని సరిచేసి అందించే పనిలో పడ్డారు.
Tags:    

Similar News