మెర్కెల్ నాలుగోసారీ మెరిసిందిగా

Update: 2017-09-26 06:33 GMT
ఒక దేశానికి అధినేత అంటే.. ఓ నాలుగేళ్లు గ‌డిపితే చాల‌నుకునే రోజులు ఇవి. ఎందుకంటే అనేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి, ప్ర‌జ‌ల‌కు ప‌రిష్కారం చూపించే స‌త్తా ఆ అధినేత‌లో ఉండాలి. లేక‌పోతే మ‌రుస‌టి ఎన్నిక‌ల్లో మంగ‌ళం ఖాయం. ఇదే ప‌రిస్థితి అనేక దేశాల్లో నెల‌కొంది. అయితే, అనూహ్యంగా జ‌ర్మ‌న్ ప్ర‌జ‌లు మాత్రం ఏంజెలా మెర్కెల్‌ కు వ‌రుస‌గా నాలుగోసారీ ప‌ట్టం క‌ట్టారు. అది కూడా అత్య‌ధిక మెజారిటీతో! దీంతో జ‌ర్మ‌నీ చ‌రిత్ర‌లోనే ఓ మ‌హిళ ఇన్నేళ్ల‌పాటు అధికారం ద‌క్కించుకోవ‌డం చ‌రిత్ర‌కెక్కింది. తాజాగా జ‌రిగిన జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఎన్నిక‌ల్లో మెర్కెల్... క్రిస్టియ‌న్‌ డెమొక్ర‌టిక్ యూనియ‌న్‌ - దాని మిత్ర‌ప‌క్షం క్రిస్టియ‌న్ సోష‌ల్ యూనియ‌న్ త‌ర‌ఫున పోటీ చేశారు.

ఈ ఎన్నిక‌ల్లో ఈ కూట‌మి 33% ఓట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. మొత్తం 246 స్థానాల్లో ఈ మిత్ర‌ప‌క్షం గెలిచింది. అదే స‌మ‌యంలో మెర్కెల్ ప్ర‌త్య‌ర్థిగా బ‌రిలోదిగిన పార్టీ సోష‌ల్ డెమొక్ర‌టిక్ పార్టీ  అభ్య‌ర్థి 20.5% ఓట్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ పార్టీ 153 స్టానాల‌కే ప‌రిమిత‌మైంది. అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీలు ఆల్ట‌ర్నేటివ్ ఫ‌ర్ జ‌ర్మ‌నీ 94 - ఫ్రీ డెమొక్ర‌టిక్ పార్టీ 80 - గ్రీన్స్ పార్టీ 67 సీట్లు సాధించాయి. ఈ సారి ఓట్ల శాతం ఒకింత త‌గ్గ‌డంతో జ‌ర్మ‌నీలో కూట‌మి పార్టీల‌తోనే ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. అయితే, దీనికి మెర్కెలే ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఆమె వ‌రుస‌గా నాలుగోసారి జ‌ర్మ‌నీ ప‌గ్గాలు చేప‌డుతున్నారు.

1954, జులై 17న జ‌న్మించిన  మెర్కెల్‌.. ఓ శాస్ర్త‌వేత్త‌. ఆమె కుటుంబానికీ, రాజ‌కీయ వాస‌న‌లే తెలియ‌వు. అయితే1989లో జ‌రిగిన ఉద్య‌మం ఆమెను  అనూహ్యంగా రాజ‌కీయ బాట ప‌ట్టించింది. 2005 నుంచి ఆమె జ‌ర్మ‌నీ ఛాన్స్‌ల‌ర్‌గా అధికారంలో ఉన్నారు. 2000 నుంచి క్రిస్టియ‌న్ డెమొక్ర‌టిక్ యూనియ‌న్ పా్ర్టీకి అధినేత‌గా  ఉన్నారు. మెర్కెల్ త‌న పాల‌న‌లో పూర్తిగా పార‌ద‌ర్శ‌క‌త‌ను పాటించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే నేత‌గా గుర్తింపు పొందారు. భార‌త్ స‌హా అన్ని దేశాల‌తోనూ స్నేహ హ‌స్తం చాచారు. ఉగ్ర‌వాదంపై పోరులో గ‌ళం విప్పారు. యూరోపియ‌న్ యూనియ‌న్‌లో తిరుగులేని మేధావిగా, పాల‌నా ద‌క్ష‌త ఉన్న ఏకైక మ‌|హిళ‌గా ఖ్యాతి గ‌డించారు. అదే ఆమెను మ‌రోసారి విజ‌యం వైపు న‌డింపించింద‌నేది విశ్లేష‌కుల మాట‌. కాగా, మెర్కెల్ కూట‌మి విజ‌యంపై భార‌త‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
Tags:    

Similar News