గత కొన్నాళ్లుగా అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ పలు సంక్షోభాలను ఎదుర్కొంటూ వస్తోంది. ఒకవైపు భారీగా పెరిగిన అప్పులు, వ్యాపారంలో మందగమనం.. అడాగ్ ను దెబ్బతీస్తూ వచ్చింది. తీవ్రస్థాయికి చేరిన ఆ అప్పులను అసలు అనిల్ అంబానీ తీర్చగలడా? అనే అంశంలో కూడా సందేహాలు తలెత్తాయి.
ఒకవైపు ధీరూభాయ్ అంబానీ పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరిగా దూసుకుపోతూ ఉండగా, అనిల్ అంబానీ మాత్రం వెనుకబడిపోయారు. పదేళ్ల కిందట అత్యంత శ్రీమంతుల్లో ఒకరిగా నిలిచిన అనిల్ అంబానీ ఆ తర్వాత మాత్రం వెనుబడిపోయారు. ప్రత్యేకించి గత కొన్నాళ్లుగా ఆయన గ్రూప్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో భారీగా ఆస్తులను, షేర్లను విక్రయించి అప్పులనే తీర్చే పనిలో పడ్డాడు అనిల్ అంబానీ. దీంతో ఆయన ఆస్తుల విలువ భారీగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఎంతగా అంటే ఇప్పుడు శ్రీమంతుల జాబితాలో అనిల్ అంబానీ పేరు ఊసులో లేకుండా పోయే పరిస్థితి వచ్చిందట.
గత కొన్ని నెలల్లో అంబానీ ఆస్తుల విలువల అనేక రెట్లు తగ్గిపోయింది. కొన్ని నెలల కిందట అనిల్ అంబానీ మొత్తం సంపద విలువ నలభై రెండు బిలియన్ డార్లు కాగా, ఇప్పుడు ఆ విలువ కేవలం అర బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయినట్టుగా బిజినెస్ వర్గాలు అంటున్నాయి. ఎక్కడ నలభై రెండు బిలియన్లు, మరెక్కడ అర బిలియన్! కొన్నాళ్లలోనే తాము ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రుణాలను తీర్చినట్టుగా అనిల్ అంబానీ స్వయంగా ప్రకటించారు.