రాహుల్ కు అనిల్ ఝ‌ల‌క్కిచ్చార‌బ్బా!

Update: 2019-05-06 10:23 GMT
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నిజంగానే ఈ ఎన్నిక‌లు చాలా ఇబ్బందులు కొని తెచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో దూసుకెళుతున్న రాహుల్ కు అడుగ‌డుగునా షాక్ లు త‌గులుతున్నాయి. తాను వేసిన సెటైర్లు త‌న‌కే తిరిగి త‌గులుతుండ‌టంతో రాహుల్ గాంధీ చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న‌టిదాకా బీజేపీ నేతలు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌రుస ఎటాక్ ల‌తో రాహుల్ ఉక్కిరిబిక్కిరి అయితే... ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ.. రాహుల్ ను మ‌రింత‌గా ఇబ్బందుల్లోకి నెట్టేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాఫెల్ డీల్ లో అనిల్ కు ల‌బ్ధి చేకూర్చేందుకు మోదీ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించారని ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం కార‌ణంగానే మోదీని రాహుల్ గాంధీ... చౌకీదార్ చోర్ హై అంటున్నారు. ఈ వివాదం ఇప్ప‌టికే కోర్టు మెట్లెక్క‌గా... రాహుల్ గాంధీ సారీ కూడా చెప్ప‌క త‌ప్ప‌లేదు. అయినా కూడా రాహుల్ తాను కోర్టుకు మాత్ర‌మే సారీ చెప్పాన‌ని, మోదీకి కాద‌ని చెప్పిన రాహుల్‌... మోదీపై తాను చేసిన చౌకీదార్ చోర్ హై కామెంట్ల‌కు క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని సంచ‌ల‌నం రేపారు. ఈ క్ర‌మంలో మోదీతో పాటు అనిల్ అంబానీపైనా రాహుల్ త‌న‌దైన సెటైర్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ అంబానీ ఓ క్రోనీ కేపిటలిస్ట్ అని, నిజాయ‌తీ లేని వ్యాపార వేత్త అని నానా మాట‌లు అనేస్తున్నారు. ఈ మాట‌ల‌న్నీ చెవినప‌డ్డా... నిన్న‌టిదాకా సైలెంట్ గానే ఉన్న అనిల్ అంబానీ... నేడు బ‌ర‌స్ట్ అయిపోయారు.

త‌న అడాగ్ గ్రూప్ ద్వారా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో రాహుల్ ను ఓ ఆటాడేసుకున్న అనిల్... దేశ అభివృద్ధిలో కీల‌క భాగ‌స్వాములైన త‌మ‌నే అనుమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. అయినా రాఫెల్ డీల్ లో తామేదో దోచుకున్నామ‌ని ఆరోపిస్తున్నారు క‌దా... మ‌రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ ప‌దేళ్ల పాటు దేశాన్ని పాలించింది క‌దా... ఆ ప‌దేళ్ల పాల‌న‌లో వివిధ రంగాల కాంట్రాక్టుల కింద అక్ష‌రాలా ల‌క్ష కోట్ల ప‌నులు చేశామ‌ని, మ‌రి ఇవి కూడా అవినీతి కింద‌కే వ‌స్తాయా? అంటూ అనిల్ ప్ర‌శ్నించారు. మొత్తంగా మోదీనే టార్గెట్ గా సాగుతున్న రాహుల్ గాంధీకి... ఇప్పుడు అనిల్ అంబానీ రూపేణా ఓ అదిరిపోయే రిటార్ట్ వ‌చ్చేసింద‌న్న మాట‌. మ‌రి అనిల్ ప్ర‌శ్న‌కు రాహుల్ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News