దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తాజాగా కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీల్లో ఒకటైన శివసేన నేతపై కాల్పులు జరిగాయి. బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు శివసేన నేత అనిల్ చౌహాన్ పై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ముంబయిలోని కశ్మీరియా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. కాల్పులతో కుప్పకూలిపోయిన ఆయన్ను వెనువెంటనే భక్తి వేదాంత ఆసుపత్రికి తరలించారు.
శివసేన నేతపై కాల్పులు జరిపిన ఘటన ముంబయిలో కలవరుపాటుకు గురి చేస్తోంది. అనిల్ చౌహాన్ పై ఎందుకు కాల్పులు జరిపారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయనపై కాల్పులు జరిపింది ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఉదంతంతో అలెర్ట్ అయిన ముంబయి పోలీసులు.. కాల్పుల వెనుక ఉన్న వారి గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.