సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం..మరో వేలు కత్తిరించుకున్న అభిమాని!

Update: 2020-11-24 17:30 GMT
అభిమానం ... ఎవరిపై , ఎందుకు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. ముఖ్యంగా సినీ హీరోలకి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోల కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉంటారు. అయితే, రాజకీయ నాయకులకి కూడా అభిమానులు ఉంటారు. తాజాగా బీహార్‌ లోని జహానాబాద్‌ కు చెందిన ఒక యువకుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాక తన మరో వేలు కత్తిరించుకుని ఆ దేవుడికి సమర్పించాడు. ఇదేవిధంగా గతంలో నితీష్ సీఎం అయినప్పుడల్లా ఆ యువకుడు తన ఒక్కో వేలుని కత్తిరించుకుంటూ వచ్చాడు.

జహానాబాద్ ‌కు చెందిన అనిల్ శర్మ సోమవారం తన నాలుగవ వేలుని కత్తిరించుకుని గోరయ్య బాబా ఆలయంలో దేవుడికి సమర్పించాడు. నితీష్ కుమార్ అంటే అనిల్ శర్మకు ఎంతో ఇష్టం. అందుకే, అతను నితీష్ సీఎం అయిన ప్రతీసారీ ఒక్కో వేలుని కత్తిరించుకుంటూ వస్తున్నాడని తెలుస్తోంది. నితీష్ కుమార్ గతంలో సీఎంగా ఎన్నికైన మూడు సందర్భాల్లో 45 ఏళ్ల అనిల్ శర్మ ఉరఫ్ అలీ బాబా తన మూడు వేళ్లను కత్తిరించుకున్నాడు. తాజాగా నవంబరు 16న నితీష్ సీఎంగా ప్రమాణం చేసిన తరువాత అనిల్ మరో వేలిని కత్తిరించుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ...ఈ విధంగా చేయడం వలన తనకు ఆనందం లభిస్తుందని అన్నాడు. నితీష్ సీఎం కావాలని మెన్నటి ఎన్నికల సందర్భంలోనూ మొక్కుకున్నానని, తన కోరిక నెరవేరాక మొక్కు తీర్చుకున్నానని చెప్పాడు.
Tags:    

Similar News