విశాఖ జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబం అయ్యన్నపాత్రుడిది. ఆయన తాత లచ్చాపాత్రుడు దశాబ్దాల క్రితమే సర్పంచుగా నర్శీపట్నంలో రాజకీయం మొదలెట్టారు. ఆయన వారసుడిగా వచ్చిన అయ్యన్నపాత్రుడు పెళ్ళి కాకుండా ఎమ్మెల్యే, మంత్రి అయి రికార్డు సృష్టించారు. పాతికేళ్ల ప్రాయంలోనే ఆయన తన పాలిటిక్స్ ని పరుగులు పెట్టించారు. అయ్యన్న ఇప్పటికి ఏడు సార్లు గెలిచారు. అనేక దఫాలు మంత్రిగా పనిచేశారు. అయితే గత రెండేళ్లుగా ఆయన మాజీగా మిగిలారు. కనీసం తన సతీమణి పద్మావతిని నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్ పర్సన్ గా చేసి ఇంట్లో అధికార దీపం వెలిగించుకుందామనుకుంటే ఆ ముచ్చట కూడా తీరలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అన్ని చోట్లా స్వీప్ చేసేసింది. ఈ క్రమంలోనే నర్సీపట్నలో కూడా వైసీపీయే జెండా ఎగరేసింది. ఇక అయ్యన తమ్ముడు సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరిన సంగతి విదితమే. ఆయన గత రెండేళ్లుగా వైసీపీని గెలిపించడానికి ఎంతగానో కృషి చేశారు. దానికి బహుమతిగా ఆయనకు పదవి దక్కలేదు. ఆయన సతీమణి అనితకు విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. అనితకు రాజకీయ అనుభవం ఉంది. ఆమె గత పర్యాయం నర్శీపట్నం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. అపుడు అయ్యన్నపాత్రుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అనిత భర్త సన్యాసిపాత్రుడు వైఎస్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఇపుడు మొత్తానికి మొత్తం అయ్యన్న ఫ్యామిలీ వారికి ఏ అధికార పదవి లేదు.
కానీ అనితకు అదృష్టం అలా తలుపు తట్టింది. జగన్ తీసుకున్న మహిళా కోటా నిర్ణయం మూలంగా సన్యాసిపాత్రుడిని దక్కాల్సిన పదవి కాస్తా అనిత పరం అయింది. దాంతో అనిత జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ చైర్ పర్సన్ గా కీలకమైన బధ్యతలను స్వీకరించారు. దీంతో బావగారు అయ్యన్నపాత్రుడు మాజీ అయ్యారు. భర్తకు పదవి లేదు. కానీ మొత్తం చింతకాయల వారి ఫ్యామిలీలో అనిత ఏకైక అధికారిక హోదాను అనుభవిస్తున్నారు. అనితకు పదవి అంటే సన్యాసిపాత్రుడికి కూడా అనుకోవాలి. కాబట్టి అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీయే ఈ అధికార పరమపద సోఫానం విషయంలో బాగా వెనకబడింది అనే చెప్పాలి.