కిరణ్ బేడి రాకపై ఇప్పటికే బీజేపీలో అసమ్మతి జ్వాలలు పెరిగిపోయాయి! ఇప్పటికైనా ఈ ఊపులో ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటూ పార్టీని ఇంతకాలం మోస్తూ వచ్చిన నేతలంతా మోడీ ఫోటోలున్న ప్లెక్సీలను సైతం తగులబెట్టేవరకూ వచ్చింది పరిస్థితి! ఈ సంగతి అటుంచితే... కిరణ్ బేడీ బీజేపీలో చేరడం పై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కూడా గుర్రు గానే ఉన్నారని సమాచారం! అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి పనిచేసిన కిరణ్‌బేడీకి ఇప్పుడు బంధం తెగిపోయినట్లే! కిరణ్ బేడీ బీజేపీలో చేరడంపై అన్నాహజారే చాలా కోపంగా ఉన్నారట!
కనీసం తనకు ఒక్క మాటయినా చెప్పకుండా, తన అభిప్రాయం వినకుండా అర్ధాంతరంగా తెరచాటు వ్యవహారాల్లో భాగంగా బీజేపీలో చేరిపోయారని హజారే ఫీలవుతున్నారట! కిరణ్ బేడీ బీజేపీలో చేరే కంటే ముందు వీరి మధ్య మాటలు బాగా ఉండేవట! నిత్యం పలకరించుకునేవారట! అయితే కిరణ్ బేడీ బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నప్పటినుంచి నుంచి అన్నా హజారే ఆమెపై చాలా కోపంతో ఉన్నారట! బీజేపీలో చేరిన నాటి నుంచి కిరణ్ బేడీ అన్నా హజారేకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆయన నుండి స్పందన లేదట! కిరణ్ ఫోన్ కాల్‌ను అన్నా హజారే ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని సమాచారం!
సర్వేల సంగతి కాసేపు పక్కన పెడితే... తాజాగా బీజేపీలో కిరణ్ బేడీ చేరికపై బెదిరిపోతున్న పార్టీలు మాత్రం.. ఈ వ్యవహారాన్ని వీలైనంత రచ్చకీడ్చి అటు పార్టీ ఇటు బేడీపై బురద చల్లడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా కమ్యూనిస్ట్ నేతలు కూడా... కిరణ్ అసలు స్వరూపం ఇప్పటికి బయటపడిందని విమర్శిస్తున్నారు! ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కమ్యూనిస్టుల మాటకు విలువ లేకపోయినప్పటికీ.. విమర్శపరంగా దానికి పరిగణన ఉంటుందని పలువురు భావిస్తున్నారు.