బాబుకు భారీ షాక్.. టీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై!

Update: 2019-07-10 10:59 GMT
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో నిరాశ నిస్పృహ‌ల్లో చిక్కుకుపోయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఊహించ‌ని రీతిలో భారీ షాక్ త‌గిలింది. గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ పార్టీకి గుడ్ బై చెప్ప‌నుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. తొలుత పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌నున్నారు.

గుంటూరు జిల్లాలో టీడీపీకి కీల‌క నేత‌గా పేరున్న అన్నం స‌తీష్.. పార్టీకి రాజీనామా చేయ‌నున్న వార్త ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. అన్నం స‌తీష్ క‌నుక పార్టీ మారితే బాప‌ట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాను మోసే నేతే ఉండ‌ర‌ని చెబుతున్నారు.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన స‌తీశ్ 2014లోనూ.. 2019లో జ‌రిగిన ఎమ్మెల్యే ఎన్నిక‌లో బాప‌ట్ల టీడీపీ అభ్య‌ర్థిగా  పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి ఆయ‌న చేసిన కృషి ఫ‌లితంగా ఆయ‌న్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండ‌లికి పంపారు. తాజాగా ప‌ద‌వికి.. పార్టీకి గుడ్ బై చెబుతున్న తీరు చూస్తే.. ఆయ‌న భ‌విష్య‌త్ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా.. అన్నం స‌తీశ్ పార్టీ నుంచి నిష్క్ర‌మించటం బాబుకు పెద్ద ఎదురుదెబ్బ‌గా చెబుతున్నారు. అన్నం స‌తీష్ బాట‌లో గుంటూరు జిల్లాకు చెందిన మ‌రికొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు ఉంటార‌ని స‌మాచారం.  

    

Tags:    

Similar News