ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ నేత ఎప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో ? ఏపీ రాజకీయం ఎప్పుడు ఎలా ? మలుపులు తిరుగుతుందో ఎవరు ఊహించలేక పోతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు.. ఎవరికి వచ్చినట్టు వారు ఏదో ఒక కామెంట్ చేస్తూ రాజకీయాన్ని హాట్ హాట్ గా మారుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ - బిజెపి నేత అన్నం సతీష్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారాయి. గుంటూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ లో జనసేన పార్టీ బిజెపిలో విలీనం అవుతుందని ప్రకటన చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందన్న ఆందోళనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడుతున్నారని... బిజెపి స్టేట్ పార్టీ కాదని... సెంట్రల్ పార్టీ అన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని సతీష్ పేర్కొన్నారు. ఇక జనసేన త్వరలోనే బిజెపిలో విలీనం అవుతుందని చెప్పిన ఆయన ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా మరో బాంబు పేల్చారు. ఇక అన్నం విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన బాపట్ల నుంచి పోటీ చేసి గెలుపు కోసం ప్రయత్నించారు.
అయితే, ప్రజలు ఆయనను తిరస్కరించారు. బాపట్లలో ఆయన టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడారు. చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేశారు. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకున్న కాంట్రాక్టులు - వ్యాపారాలను కాపాడుకునేందుకు ఆయన సుజనా చౌదరి ద్వారా బీజేపీలోకి జంప్ చేసేశారు. సతీష్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా కొద్ది రోజులుగా పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే జనసేన బిజేపీలో విలీనం అవుతుందన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు సతీష్ వ్యాఖ్యలు కూడా అందుకు బలం ఇచ్చేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలకు జనసేన అభిమానులు ఎలా స్పందిస్తారో? చూడాలి.