ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆరు స్థానాలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. కరోనా తో మరణించిన ఇద్దరు నేతల కుమారులకు జగన్ ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించారు. చిత్తూరు జిల్లా నుంచి.. ఇటీవల కరోనా తో మరణించిన దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి జగన్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కరోనాతో మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానంలో ఆయన కుమారుడికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం జగన్ కల్పించారు.
పదవీ కాలం ముగుస్తోన్న అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు అనంతపురం నుంచి మరోసారి అవకాశం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇంచార్జ్‌గా పని చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌ను మరో స్థానానికి ఎంపిక చేశారు. ఆయన గతంలో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. విజయవాడ కార్పొరేటర్ కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. వీరంతా త్వరలో నామినేషన్లు వేస్తారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. అయితే , టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని సజ్జల తెలిపారు.
ఈ నెల 29తో మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి పదవీ కాలం ముగియనుంది. చల్లా రామకృష్ణ రెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది.
వైఎస్సార్‌సీపీ ఆరుమంది ఎమ్మెల్సీ అభ్యర్థులు
1. చల్లా భగీరథరెడ్డి
2. బల్లి కల్యాణ చక్రవర్తి
3. సి.రామచంద్రయ్య
4. మహ్మద్ ఇక్బాల్
5. దువ్వాడ శ్రీనివాస్
6. కరీమున్నీసా