ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోడిని అధికారానికి దూరంగా చేయడం కోసమే తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే మోడీని గద్దె దింపడానికి వ్యతిరేకంగా 19 పార్టీలతో ఓ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
అంటే యూపీఏ ఉండగానే మమత, పవార్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఇలా ఉండగానే తాజాగా తృతీయ ఫ్రంట్ పేరుతో మరో ప్రయత్నం మొదలైంది. ఇందులో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలుంటాయని అనుకుంటున్నారు. ఈనెల 25వ తేదీన హర్యానాలోని జింద్ లో మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి రోజున ఇండియన్ నేషనల్ లోకదల్ (ఐఎన్ఎల్డీ) అగ్రనేత ఓం ప్రకాష్ చౌతాలా నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది.
కార్యక్రమానికి అనేకమంది ప్రతిపక్షాల నేతలను చౌతాలా ఆహ్వానించారు. ఈ బహిరంగ సభకు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ములాయం సింగ్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా లాంటి అనేక మందిని ఇప్పటికే ఆహ్వానించారు. ఇంతమందిని ఎందుకు పిలిచారంటే ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయటానికట. రాబోయే ఎన్నికల్లో తృతీయకూటిమి కట్టి నరేంద్రమోడిని ఎదుర్కొంటామని చౌతలా బద్దగుద్దకుండానే చెబుతున్నారు.
ఇప్పటికే ఓ ఫ్రంట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి కదా అంటే దాని సంగతి తనకు అనవసరమంటున్నారు. అంటే నిజంగానే తృతీయ కూటమి ఏర్పాటు జరిగిందంటే మరి దానికి నాయకత్వం ఎవరు వహిస్తారు ? దాని అజెండా ఏమిటి ? ఏ ఏ రాష్ట్రాల్లో దానికి మిత్రపక్షాలుంటాయి లాంటివి ఇప్పటికైతే సస్పెన్సుగానే ఉంది. ఎందుకంటే ఇపుడు చౌతాలా నుంచి ఆహ్వానం అందుకున్న మమత, పవార్ లాంటి నేతలు వేరే ఫ్రంట్ ఏర్పాటులో చాలా రోజులుగా బిజీగా తిరుగుతున్నారు.
మరిలాంటి నేపధ్యంలో చౌతాలా చెబుతున్నట్లు తృతీయ కూటమి లో వీళ్ళు చేరుతారా అనేది డౌటుగానే ఉంది. ఏదేమైనా తృతీయకూమిటి ఏర్పాటయితే అంతకు మించి కావాల్సింది మోడీకి ఏముంటుంది ? తనకు వ్యతిరేకంగా ఎన్ని కూటములు తయారైతే మోడీకి అంత మంచిది. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఓట్లలో ఎన్ని చీలికలు వస్తే అధికార పార్టీ అంత హ్యాపీగా ఉంటుంది. అందుకనే మోడీ హ్యాపీగా ఉన్నారు.
మరి మమత, పవార్ ప్రయత్నాలు ఫలించి కొత్త ఫ్రంట్ ఏర్పాటవుతుందా ? లేకపోతే చౌతాలా ప్రయత్నాలతో తృతీయ కూటమి ఏర్పాటవుతుందా ? లేకపోతే రెండు కూటములు ఏర్పాటు అవుతాయా ?చూడాల్సిందే.