ఇటీవల పలు ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ బ్యాంకులు దివాలా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన ఓ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. అయితే డిపాజిటర్ల కు ఎటువంటి ఇబ్బందులు కాకుండా పకడ్బందీ చర్యలు కూడా చేపట్టింది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కేంద్రంగా 'వసంత్‌దాదా నగరి సహకారి బ్యంక్' పనిచేస్తుంది.
అయితే ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
జనవరి 11 నుంచి బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం అమల్లోకి రానున్నది. ఇప్పటికే రిజర్వ్‌బ్యాంక్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11 నుంచి ఈ బ్యాంక్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు బ్యాంక్‌కు లిక్విడేటర్‌ను నియమించాలని కూడా ఆదేశించింది. ఈ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆర్బీఐ పేర్కొన్నది.
ప్రస్తుతం డిపాజిటర్లకు కూడా పూర్తిస్థాయి డబ్బులు చెల్లించే స్థితిలో ఈ బ్యాంక్ లేదు. ఈ నేపథ్యంలో ఈ కస్టమర్లు ఎవరూ ఇక్కడ డిపాజిట్ చేయొద్దని రిజర్వ్‌బ్యాంక్ సూచించింది.
అయితే బ్యాంకులో డబ్బులు దాచుకున్న ఏ ఇబ్బంది ఉండదని ఆర్థికవిశ్లేషకులు అంటున్నారు. అయితే రూ. 5 లక్షలవరకు డిపాజిట్ చేసిన వినియోగదారులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించనున్నారు. మరోవైపు అంతకంటే ఎక్కువ దాచుకున్నవారికి కూడా 99 శాతం డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది.