మిష‌న్ బిల్డ్ ఏపీకి ఎదురు దెబ్బ‌.. నీతిఆయోగ్ షాక్‌..!

Update: 2021-12-19 09:05 GMT
మిష‌న్ బిల్డ్ ఏపీ.. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్టు. దీనివల్ల నిర‌ర్ధ‌కంగా ఉన్న ఆస్తుల‌ను అమ్మేసి.. సొమ్మును ఖ‌జానాకు త‌ర‌లించ‌డ‌మే. ఇది స‌హ‌జంగా ఇత‌ర రాష్ట్రాలు, కేంద్రంలోనూ సాగుతున్నాయి. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం కూడా భూములు విక్ర‌యించింది. ఇక‌, కేంద్రం ఎప్ప‌టి నుంచో.. ప్రైవేటీక‌ర‌ణ మంత్రాన్ని ప‌ఠిస్తోంది. ఈ క్ర‌మంలోనేఏపీలోనూ.. జ‌గ‌న్ స‌ర్కారు.. మిష‌న్ బిల్డ్ ఏపీ ద్వారా.. నిర‌ర్ధక ఆస్తుల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు.

స‌ద‌రు ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం త‌ప్పుకాదు కానీ.. భూముల‌ను ఎలా విక్ర‌యిస్తార‌ని.. వాటిని కొంద‌రు దాత‌లు ఎంతో దూర‌దృష్టితో ఇచ్చార‌ని.. కాబ‌ట్టి ఆయా భూముల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి హ‌క్కులూ ఉండ‌బోవ‌ని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు మిష‌న్ బిల్డ్ ఏపీపై స్టే విధించింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నీతిఆయోగ్‌ను ఆశ్ర‌యించింది. ``నిర‌ర్ధ‌క ఆస్తుల‌ను విక్ర‌యించాల‌ని మీరు చెబుతున్నారు క‌దా.. అదే విష‌యాన్ని హైకోర్టుకు కూడా చెప్పండి.మీరు కూడా వచ్చి ఇంప్లీడ్ అయితే కోర్టు సానుకూల నిర్ణయం చెబుతుంది అని.. నీతిఅయోగ్‌కు లేఖ రాసింది. అయితే.. ఏ పీ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌పై .. నీతి ఆయోగ్ చిత్రంగా రియాక్ట్ అయింది.

తాము ప్రభుత్వ సంస్థలు.. మౌలిక‌ సదుపాయాల ప్రాజెక్టుల గురించి చెప్పాం కానీ.. భూముల గురించి కాదని… అంటే సృష్టించిన ఆస్తులను అమ్మమన్నాం కానీ భూములను కాదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. భూముల అమ్మకానికి తాము వ్యతిరేకమని … హైకోర్టులో జరుగుతున్న భూముల అమ్మకం కేసుల్లో తాము ఇంబ్లీడ్ కాలేమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఏపీ స‌ర్కారు త‌ల ప‌ట్టుకుంది. ఒక‌వైపు కేంద్రం ఆర్థికంగా ఆదుకోవ‌డం లేదు. మ‌రోవైపు.. సంక్షేమ ప‌థ‌కాల ప‌రుగులతో ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌నీసం నిర‌ర్ధక ఆస్తుల‌ను విక్ర‌యించుకునేందుకు కూడా ఇలా మెలిక‌లు ఎందుకు? అనే ప్ర‌శ్న‌లు వేస్తోంది. మ‌రి దీనికి కేంద్రం ఎలాంటి స‌మాధానం చెబుతుందో చూడాలి.


Tags:    

Similar News