తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పదా?

Update: 2019-11-22 08:53 GMT
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. జర్మనీలో సెటిల్ అయ్యి అక్కడి పౌరసత్వం పొందిన రమేశ్ 2009లో వేములవాడలో పోటీచేసి గెలిచాడు. అనంతరం గులాబీ గూటికి చేరి వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేములవాడలో గెలిచాడు. అయితే చెన్నమనేని భారత పౌరుడు కాదని ఆయన చేతిలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పోరాడారు. కోర్టులు, చివరకు హొంశాఖ ద్వారా అప్పీలు చేశాడు. ఎట్టకేలకు చెన్నమనేని పౌరసత్వం చెల్లదని.. ఆయన భారత పౌరుడు కాదని హోంశాఖ తేల్చింది.

ఈ పరిణామంతో చెన్నమనేని ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయే ప్రమాదంలో పడింది. ఆయన హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే వేములవాడలో ఉప ఎన్నికల జరగవచ్చు.

ఇక చెన్నమనేని ఎన్నిక చెల్లదనుకుంటే ఆయన తర్వాత వేములవాడలో అత్యధిక ఓట్లు సంపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలుంటాయి. అప్పట్లో కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే విషయంలో ఇలానే జరిగింది.

అయితే ఉప ఎన్నికా లేదా ఓడిన అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడా అన్నది ఇప్పుడు హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. హైకోర్టు తీర్పుతో తెలంగాణలో ఉప ఎన్నికలు మళ్లీ జరుగుతాయా లేదా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి  ఏకంగా ఎమ్మెల్యే అవుతాడా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News