బాలీవుడ్ కపుల్ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కపుల్ పై ముంబై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ప్రారంభించిన ఫిట్ నెటస్ ఎంటర్ ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే తన దగ్గర నుంచి కోటి 51 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదిరించారని ఆ బిజినెస్ మ్యాన్ ఆరోపిస్తున్నారు. వ్యాపారవేత్త నితిన్ బరాయ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జులై 2014లో ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతోపాటు ఇతరులు సంస్థలో రూ.1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు ఫిర్యాదు దారు తెలిపాడు. ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ కంపెనీ తనకు ఫ్రాంఛైజీని కేటాయిస్తుందని.. అంతేకాకుండా పొరుగున ఉన్న ఫూణేలోని హడప్పర్, కోరేగావ్ లలో జిమ్, స్పాను తెరుస్తుందని తనకు హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు తెలిపాడు. అయితే డబ్బు ఇచ్చినప్పటికీ వారి ప్రపోజల్ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు. దీంతో తన డబ్బును ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.బాధితుడి ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా.. సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ ఇంతలోనే ఈ దంపతులపై చీటింగ్ కేసు నమోదవడం సంచలనంగా మారింది.