తండ్రి అధికారంలో ఉంటే కొడుకు ఎంతలా చెలరేగిపోవచ్చన్న విషయాన్ని తెలుగు ప్రజలకు కొత్త కోణంలో చూపించి సంచలనంగా మారారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ. బెదిరింపులు.. దందాలు.. సెటిల్ మెంట్లు.. ఇలా ఒకటేమిటి? ఆయన చేయని నేరం ఉండదన్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు బాధితులు ఆయన కారణంగా తామెంత నష్టపోయిన విషయాన్ని ఫిర్యాదుల రూపంలో బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు.
ఒకటి తర్వాత ఒకటిగా బయటకొచ్చిన ఆరోపణలు ఇలా ఉంటే.. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్సీఎస్ నాయకుడు కాల్వ రవి తాజాగా ఒక ఫిర్యాదు చేశారు. 2015లో మద్దూరి నాగరాజుకు జెడ్పీలో అటెండర్ పోస్టు ఇప్పిస్తామని చెబుతూ కోడెల శివరామ్ రూ.5లక్షలు.. ప్రసాద్ రూ.2లక్షలు నగదు తీసుకున్నారని ఆరోపించారు. ఇంత డబ్బులు తీసుకొని కూడా ఉద్యోగం కూడా ఇప్పించలేదన్నారు.
దీంతో.. తాను కోడెల శివరామ్ వద్దకు వెళ్లి దీని గురించి మాట్లాడగా.. తనను కులం పేరుతో తిట్టారని.. మోసం చేశారంటూ ఆరోపణించారు. ఈ నేపథ్యంలో కోడెల శివరామకృష్ణ.. ఆయన కార్యదర్శి ప్రసాదులపై నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో మోసం.. కుల దూషణ.. బెదిరింపు నేరాల మీద కేసు నమోదు చేశారు. రానున్న రోజుల్లో ఈ తరహాలో మరెన్ని కేసులు నమోదవుతాయో?