2002 గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ బుధవారం నాడు క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తన తుది నివేదికను గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది. మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులకు క్లీన్ చిట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కానీ, ప్రేరణతో గానీ ఈ ప్రమాదం జరగలేదని నానావతి కమిషన్ స్పష్టం చేసింది.
2008లో తొలి నివేదికలో కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. 2002లో జరిగిన అల్లర్లపై 2014లో రిటైర్డ్ జస్టిసెస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాల కమిటీ తుది రిపోర్టుతో ప్రముఖులకు ఉపశమనం లభించినట్లే అని చెప్పవచ్చు. గుజరాత్ అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రజలు చనిపోగా అందులో ఎక్కువ ముస్లింలే కావడం గమనార్హం. గాంధీనగర్‌కు 150కి.మీల దూరంలో ఉన్న గోద్రాలోని ఓ ట్రైన్‌లో ఫిబ్రవరి 27న 59మంది హిందువులను కాల్చి చంపిన ఘటన తర్వాత గుజరాత్ లో అల్లర్లు చేలరేగాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు అల్లర్లని అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైనట్లు అందులో తెలిపారు. దీనికి అప్పటి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదని తెలిపింది.