కుల ఉద్యమాలతో ఇప్పటికే వేడెక్కిన నవ్యాంధ్రలో మరో కుల ఉద్యమం ఊపిరిపోసుకోనుంది. 20 శాతం రిజర్వేషన్ల డిమాండుతో బ్రాహ్మణ - వైశ్య - రెడ్డి - కమ్మ - క్షత్రియ - వెలమ కులాలన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. ఉద్యమ స్వరూప స్వభావం - కార్యాచరణ ఖరారు కోసం - ఆయా కుల సంఘాల ప్రతినిధులు ఈ నెల 19న శ్రీశైలంలోని అఖిల భారత రెడ్డి సంఘాల సమాఖ్య కల్యాణమండపంలో భేటీ కానున్నాయి. దీనితో నవ్యాంధ్రలో గుజరాత్ మాదిరిగా కొత్తగా అగ్రకుల పోరాటానికి తెరలేవనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇప్పటివరకూ బీసీ - కాపు ఉద్యమాలతో హోరెత్తుతున్న నవ్యాంధ్రలో ఇక అగ్రకుల ఉద్యమం కూడా చేరితే చంద్రబాబుకు అది తలనొప్పే కానుంది. బ్రాహ్మణ - వైశ్య - రెడ్డి - కమ్మ - క్షత్రియ - వెలమ కులాల్లోని నిరుపేదలకు విద్య - ఉద్యోగ - ఉపాధిరంగాల్లో తప్పనిసరిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో అగ్ర కులాలన్నీ ఓకే వేదికపై వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికోసం ఆయా కులాల్లోని ప్రముఖులంతా తొలిసారిగా ఒకే తాటిపైకి రానుండటం విశేషం.
కాపు ఉద్యమం.. దానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత దిగొచ్చిన నేపథ్యంలో అగ్రవర్ణాలు కూడా తామూ రిజర్వేషన్లు డిమాండ్ చేస్తే ఏదో ఒక ఫలితం దక్కుతుందన్న భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంతోనే అగ్ర కులాలన్నింటికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని, అది సాధ్యం కాకపోతే అగ్ర వర్ణాలన్నింటికీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు పదును పెడుతున్నారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, అయితే దానికి ఇచ్చిన 67 కోట్లు సరిపోవని, ఇంకా పెంచాలని, అదేవిధంగా అన్ని కులాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ మాదిరిగానే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని, అది సాధ్యం కాని పక్షంలో అగ్రకులాలన్నింటిని కలిపి ఒకే కార్పొరేషన్ గా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ తో, ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో కోస్తాలో మహాగర్జన ఏర్పాటు చేయడానికి.. తర్వాత తెలంగాణలో కూడా సభలు నిర్వహించడానికి వారంతా ప్రణాళికలు రచిస్తున్నారు. దానికి సంబంధించి 19న శ్రీశైలంలో జరిగే కీలక భేటీలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇప్పటివరకూ బ్రాహ్మణ - కమ్మ - రెడ్డి - వైశ్య - వెలమ వర్గాల ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ, వారి వల్ల ఆయా కులాలకు వచ్చిన ప్రయోజనాలేమీ లేవని వారు గుర్తు చేస్తున్నారు. వారు కూడా తమ పార్టీల ఉనికి కోసం ఇతర కులాలకే ప్రయోజనాలు చేకూర్చి, సొంత కులాలకు మేలు చేస్తే, ఎక్కడ ఇతర కులాల దృష్టిలో దోషిగా నిలబడతామన్న భయంతో అగ్ర కులాలను నిర్లక్ష్యం చేసిన చరిత్రను గుర్తు చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం.. ఏపిలో బిసిలు 45 శాతం - కాపులు 10 - ఎస్సీ 10 - ఎస్టీ 5 - మైనారిటీలు 9 శాతం - రెడ్డి 6 - కమ్మ 5 - వెలమ 2 - వైశ్య 3 - బ్రాహ్మణ 2 - క్షత్రియ 3 శాతం ఉన్నారు. తెలంగాణలో బిసిలు 45 - ఎస్సీ 15 - ఎస్టీ 5 - మైనారిటీ 12 - బలిజ 4 - కమ్మ 3 - రెడ్డి 5 - వెలమ 5 - క్షత్రియ 2 - వైశ్య 2 - బ్రాహ్మణులు 2 శాతం ఉన్నారు. రెండు ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో ఓసీయేతర కులాలకు 38 కోట్లు కేటాయించాయి.
కమ్మ - రెడ్డి - వెలమ - వైశ్య - బ్రాహ్మణ - క్షత్రియ కులాలన్నీ కలిపి ఏపీలో 21 శాతం, తెలంగాణలో 19 శాతం ఉన్న నేపథ్యంలో వారంతా సంఘటితమై పోరు జరిపితే అది రాజకీయాలపై తీవ్ర ప్రభావమే చూపనుంది. పైగా ఈ కులాలకు గ్రామాల్లో ఆధిపత్యం ఉండడంతో వారు మిగతా ప్రజలనూ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అగ్రకుల వేదిక అనేది ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో చూడాలి.