గుడ్ న్యూస్: దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్

Update: 2021-08-20 16:30 GMT
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలోకి మరో వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ తోపాటు రష్యాన్ తయారీ స్పుత్నిక్ వి, అమెరికా తయారీ మోడెర్నా  వ్యాక్సిన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ఇప్పుడు దానికి తోడుగా మరో వ్యాక్సిన్ వచ్చి చేరింది.  కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో ఇప్పుడు దేశంలోని అర్హులందరికీ కేంద్రప్రభుత్వమే ఉచితంగా టీకాలు వేస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా స్వదేశంలో తయారైన మరో టీకా 'జైడస్ క్యాడిల్లా' తయారు చేసిన 'జైకోవ్ డీ' అనే టీకాకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది.

ఇండియాలో కరోనా వైరస్ కోసం అత్యవసర అనుమతి పొందిన ఐదో వ్యాక్సిన్ జైడస్ క్యాడిల్లా కావడం విశేషం.   వీటితోపాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

డీఎన్ఏ ఆధారంగా రూపొందించిన వ్యాక్సిన్ 'జైకోవ్ డీ'. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు డీసీజీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

12 ఏళ్లు దాటిన చిన్నారులు సహా పెద్దలందరికీ ఈ వ్యాక్సిన్ ఉపయోగించేందుకు అనుమతి ఉంది. జైడస్ క్యాడిల్లా అందుబాటులోకి రావడంతో 12 ఏళ్ల పైబడిన పిల్లలకు వ్యాక్సిన్లు వేసి పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి భారతదేశ స్వదేశీ అభివృద్ధి చెందిన డీఎన్ఏ ఆధారిత కోవిడ్ టీకా ఇదని తెలిపారు.
Tags:    

Similar News