భార‌త్‌ లో మ‌రో ప్ర‌మాద‌క‌ర క‌రోనా వేరియంట్‌ .. ఏడు రోజుల్లోనే .. !

Update: 2021-06-07 16:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి జోరు కొనసాగుతుంది.  దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రతి రోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ఈ మహమ్మారి జోరు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అని అనుకుంటున్న సమయంలోనే కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడూ దాని రూపాన్ని మార్చుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌కంగా మారుతోంది. తాజాగా భార‌త్‌ లో మ‌రో ప్ర‌మాద‌క‌ర క‌రోనా వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ బారిన ప‌డిన వారు ఏడు రోజుల్లో తమ బరువు కోల్పోతారు. గ‌తంలో ఈ వేరియంట్‌ ను బ్రెజిల్‌ లో గుర్తించారు.

ఈ మధ్య కరోనా వైరస్‌ కు చెందిన‌ రెండు కొత్త వేరియంట్లు బ్రెజిల్ నుంచి మనదేశంలోకి ప్ర‌వేశించాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. భార‌త్‌ లో  క‌నిపించిన ఈ కొత్త వేరియంట్ పేరు B.1.1.28.2. ప్రస్తుత సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌ ను ఎలుకల‌పై పరీక్షించ‌గా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ న్యూ వేరియంట్ సోకితే, ఏడు రోజుల్లోనే దానిని సులభంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు క‌నుగొన్నారు. అలాగే ఇది చాలా ప్రమాదకరమైనద‌ని, బాధితులు కేవలం ఏడు రోజుల్లోనే త‌మ శరీర బరువును చాలా అధికంగా కోల్పోతారని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ వేరియంట్ యాంటీబాడీ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంద‌ని వెల్లడించారు. దీనిగురించి పూణేలోని నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు స్పందిస్తూ విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు బాధితుల‌లో ఈ కొత్త వేరియంట్ ను కనుగొన్నామ‌న్నారు. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా లేవ‌ని చెప్పారు.
Tags:    

Similar News