బెంగాల్ హీరోయిన్, దేశంలోనే అత్యంత యువ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ కు తాజాగా మరో కష్టం వచ్చి పడింది. ఆమెకు భర్త లేడని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు అందినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భర్తకు దూరమైన ఆమెకు.. లోక్ సభ సభ్యత్వం కూడా దూరమవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఆ వివరాలేంలో చూద్దాం..
బెంగాలీలో స్టార్ హీరోయిన్ అయిన నుస్రత్ జహాన్.. 2019 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. మంచి మెజారిటీతో విజయం కూడా సాధించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. కాపురంలో విభేదాలు తలెత్తడంతో కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు.
అయితే.. వీరిద్దరూ ఇండియాలో వివాహం చేసుకోలేదు. టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో ఒక్కటయ్యారు. టర్కీ వివాహ చట్టాలను అనుసరించి వీరి పెళ్లి జరిగింది. అయితే.. నుస్రత్ పెళ్లి చేసుకున్న సమయంలోనే ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా తాను వివాహితురాలినని, తన పేరు నుస్రత్ జహాన్‌రూహి జైన్ అని చెప్పారు.
అయితే.. నుస్రత్ పెళ్లి భారత్ లో జరగలేదు కాబట్టి, ఇక్కడ రిజిస్టర్ కాలేదు. విదేశాల్లో జరిగిన పెళ్లి కాబట్టి ఇక్కడ విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదనేది నుస్రత్ మాట. తమది ఓ లివింగ్ రిలేషన్ షిప్ వంటిదని నుస్రత్ అంటున్నారు. దీనికి అభ్యంతరం చెబుతున్నారు ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య.
ఈ మేరకు స్పీకర్ లేఖ కూడా రాశారు. వైవాహిక జీవితం విషయంలో నుస్రత్ తప్పుడు సమాచారం ఇచ్చారని, లోక్ సభను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. అందువల్ల ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలనేది మౌర్య డిమాండ్. కాగా.. ఈ విషయమై ఆరాతీయగా.. పార్లమెంటుకు ఎలాంటి లేఖా అందలేదని తెలిసింది. మరి, దీనిపై సంఘమిత్ర మౌర్య ఏమంటారో చూడాలి.