హైద‌రాబాద్‌ లో మ‌రో డ్ర‌గ్స్ ముఠా అరెస్ట్‌!

Update: 2017-08-14 10:33 GMT
ఇప్ప‌టికే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాలు, కేసుల‌తో ఒణికిపోతున్న భాగ్య‌న‌గ‌రం... హైద‌రాబాద్‌.. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. పోలీసులు జ‌రిపిన సోదాల్లో.. నైజీరియాకు చెందిన ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ ఎత్తున డ్ర‌గ్ నిల్వ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాలు.. హైద‌రాబాద్‌లో  గాబ్రియెల్ అనే నైజీరియన్ తోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాబ్లెట్లు - చాక్లెట్లు - బిస్కెట్ల రూపంలో వీరు డ్రగ్స్ సరఫరా చేస్తుండటం గమనార్హం. నిందితులను నగరంలోని యాప్రాల్‌ లో అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

గాబ్రియెల్‌ కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారు కెల్విన్‌ తో సంబంధాలున్నాయని తెలిపారు. అరెస్టైన నలుగురు నిందితులు కూడా పలువురు ప్రముఖులకు - పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. 2014లో స్టూడెంట్ వీసాపై భారత్‌ కు గాబ్రియెల్ వచ్చాడని, నిజాం కాలేజీలో చేరాడని భగవత్ తెలిపారు. ఆ తర్వాత నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు. ఈ ముఠాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ యువకుడు ఉన్నాడని, అతడు నగరంలోని ఈసీఐఎల్ ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు. అరెస్టైన నలుగురు నిందితుల్లో ఒకడైన అంకిత్ పాండే ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు.

అంకిత్ పాండే తమకు కీలక విషయాలు చెప్పాడని తెలిపారు. మరో యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేసే పనిలో ఉన్నాడని చెప్పారు.  కాగా, డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యులంతా కలిసి ఆగస్టు 15న గోవాలో భారీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లు నిందితులు తెలిపారని చెప్పారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన జాన్ హెన్రీతో కూడా ఈ నలుగురు నిందితులకు సంబంధాలున్నాయని సీపీ చెప్పారు. గాబ్రియెల్ గతంలో కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని చెప్పారు.  తన ప్రియురాలు ఇస్తర్‌ తో కలిసి నగరంలోనే నివాసం ఉన్నాడని తెలిపారు. మొత్తానికి వీరిని ప‌ట్టుకోవ‌డంతో మ‌రింత స‌మాచారం వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.
Tags:    

Similar News