పారా ఒలింపిక్స్‌ : భారత్‌కు మరో స్వర్ణం

Update: 2021-08-30 11:35 GMT
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో భారత పారా అథ్లెట్ల పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం పురుషుల జావెలిన్ త్రో   ఎఫ్ 62 కేటగిరీలో ఇండియన్ అథ్లెట్ సుమిత్ అంటిల్  68.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్‌ లో తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే 5వ ప్రయత్నంలో ఏకంగా 68.55 మీటర్ల దూరం విసిరి తన వరల్డ్ రికార్డును మరోసారి సవరించాడు.

ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్ బురెయిన్ 66.29 మీటర్ల దూరం విసిరి రజతం, శ్రీలంకకు చెందిన దులాన్ కొడితువాక్కు రజత పతకం గెలిచుకున్నాడు. ఇండియాకే చెందిన సందీప్ చౌదరి 62.20 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంల నిలిచాడు. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

ఇక ఇప్పటికే ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ విభాగం లో భారత్‌ కు గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ లో గోల్డ్‌ గెలిచింది అవని లేఖరా. దీంతో పారాలింపిక్స్‌ లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ గా చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా కాసేపటి క్రితమే… సమిత్‌ అంటిల్‌ కు స్వర్ణ పతకం వచ్చింది. దీంతో భారత్‌ ఖాతా లో మొత్తం రెండు బంగారు పతకాలు వచ్చినట్లైంది.
Tags:    

Similar News