ఢిల్లీ విమానాశ్రయానికి మ‌రో గుడ్ న్యూస్‌...!

Update: 2022-08-17 01:30 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం.. మ‌రిన్ని హంగులు అల‌దుకో నుంది. ఇప్ప‌టికే.. దేశంలోనే `నెంబ‌ర్ 1` పొజిష‌న్‌లో ఉన్న ఈ విమానాశ్ర‌యంలో ప్ర‌స్తుతం మూడుర‌న్ వేలు మాత్ర‌మే ఉన్నాయి. అయితే.. పెరుగుతున్న ర‌ద్దీ కార‌ణంగా.. ప్ర‌యాణికుల‌కు సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించేందుకు వీలుగా.. ఈ ర‌న్‌వేల సంఖ్య‌ను మ‌రిన్ని పెంచ‌నున్నారు. ఈ క్ర‌మంలో నాలుగో ర‌న్ వే నిర్మాణాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

2023 నాటికి నాలుగో ర‌న్‌వేను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇన్ స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్ట‌మ్ ల ఏర్పాటు పూర్త‌యింది. ర‌న్ వే పెయింగ్, క్యాలిబరేష‌న్ టెస్ట్ లు ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేసి.. కొత్త సంవ‌త్స‌రంలో ఈ నాలుగో ర‌న్ వేను అందుబాటులోకి తేనున్నారు. దీంతో మ‌రింత మంది ప్ర‌యాణికులకు సేవ‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని విమానాశ్ర‌య వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ప్ర‌స్తుతం ఏటా 7 నుంచి 9 కోట్ల మంది ప్ర‌యాణికులు.. జాతీయంగా అంత‌ర్జాతీయంగా.. ఈ విమానాశ్ర యం నుంచి రాక‌పోక‌లు సాగిస్తున్నారు. ఇక‌, నాలుగో ర‌న్ వే కూడా అందుబాటులోకి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణికుల సంఖ్య 10 కోట్ల నుంచి 14 కోట్ల‌కు పెరుగుతుంద‌ని..అంచ‌నా వేయ‌డం గ‌మనార్హం. ఇప్ప‌టికే దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే విమానాశ్ర‌యాల్లో ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఒక‌టి.

ఇక‌, ఇప్పుడు నాలుగో ర‌న్‌వే కూడా అందుబాటులోకి వ‌స్తే.. ర‌ద్దీ మ‌రింత పెరుగుతుంద‌ని పేర్కొంటున్నా రు. ఇదిలావుంటే.. విమానాల సంఖ్య పెంపు, ప్ర‌యాణికుల రాక‌పోక‌లు పెరుగుతున్న క్ర‌మంలో కొత్త‌గా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను కూడా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా కీల‌క‌మైన ఎయిర్ ట్రాపిక్ కంట్రోల‌ర్స్ (ఏటీసీవో) నియామ‌కం చేప‌ట్టాల్సి ఉంటుంది.

పెద్ద‌దైన ఐజీఏలో ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌కు ఎంతో అనుభ‌వం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్స్ కావాల్సిన ఉంది. దేశంలో ట్రాఫిక్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించేందుకు కూడా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఢిల్లీ విమానాశ్ర‌యాన్ని జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఏఏఐకు కూడా 26 శాతం వాటా ఉంది. మ‌రి ఇప్పుడు  మ‌రింత మంది సిబ్బందిని పెంచుతారా?  లేక ఏం చేస్తారు? అనేది చూడాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News