తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, మాటల మాంత్రికురాలిగా గుర్తింపు పొందిన కవితపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆమెపై భారీ ఆరోపణ వెలుగు చూసింది. ఆమె బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ప్రయత్నిం చారని.. దీనిపై విచారణ చేయాలని.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల.. ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలోనూ.. కవిత పాత్ర ఉందని.. ఆమె ప్లాన్ ప్రకారమే.. అక్కడ మద్యం స్కాం జరిగిందని.. బీజేపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే.. తనపై అనవసర వ్యాఖ్యలు చేసి.. పరువు తీశారని.. కవిత వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లి.. సంబంధిత బీజేపీ నేతలపై పరువు నష్టం దావా కూడా వేశారు. దీనిపై కోర్టు వారిని సమన్లు జారీ చేసింది. అయినా.. కూడా బీజేపీ నేతల నుంచి కవితపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉండగా.. ఇప్పుడు తాజాగా కవితను కాంగ్రెస్ కార్నర్ చేయడం గమనార్హం.
కాంగ్రెస్ బక్క జడ్సన్ ఆమెపై బ్లాక్ మనీ ఆరోపణలు చేయడం.. గమనార్హం. ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా లైగర్ ఫ్లాప్ అయిందనే టాక్ వచ్చింది. అయితే.. దీనికి నిర్మాతగా.. ప్రముఖ నటి ఛార్మి వ్యవహరించారనే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే.. తాజాగా జడ్సన్ మాత్రం.. ఈ సినిమాకు కవిత కూడా పెట్టుబడి పెట్టారని అన్నారు.
తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని.. ఈ సనిమాకు పెట్టుబడిగా పెట్టారని.. వైట్ మనీగా మార్చుకునే ప్రయత్నం చేశారని.. కవితపై తీవ్ర ఆరోపణలే చేశారు. అంతేకాదు.. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దృష్టి పెట్టాలని.. కవిత ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగాలని.. కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి ఇటీవల కాలంలో వరుస వివాదాలు తలెత్తడం.. అవి కూడా మద్యం, మనీ సంగతులు కావడంతో కవిత వ్యవహారం.. రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది. మరి తాజాగా జడ్సన్ చేసిన ఆరోపణలపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.