తెలంగాణలో సంచలనంగా మారిన ఈఎస్ఐ స్కామ్ లో ఈడీ సోదాలు తెలంగాణ అధికారపక్షంలో కలకలాన్ని రేపుతున్నాయి. మాజీ హోం మంత్రి అల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయిలు నగదు.. భారీగా ఆస్తులు బయటకు రావటం తెలిసిందే. ఈ విషయం మీద తెలంగాణ అధికార పార్టీ నేతలు కిక్కురుమనటం లేదు. ఇదిలా ఉంటే.. ఏపీలో మెడికల్ ఎక్విప్ మెంట్ నిర్వహణ అంశంపై గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది.
అప్పట్లో ఏపీఎస్ఎంఐడీసీ ఎండీగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్ పేరు వినిపించటం ఇప్పుడు రాజకీయంగా హీట్ పెరుగుతోంది. 2015లో జరిగిన ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని.. కాంట్రాక్టర్లు.. ఉన్నతాధికారులు రూ.కోట్లు తిన్నట్లుగా కంప్లైంట్లు వచ్చాయి. వాటిపై ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని విచారణ జరిపిన హైకోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది.
దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఐడీని ఆదేశించారు. అనంతరం సీఎస్ గా వచ్చిన నీలం సాహ్ని కూడా ఆదేశాలు జారీ చేవారు. ఈ వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్కెట్ ధర కంటే భారీగా పెంచేసి మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. మొత్తం రూ.200 కోట్లు విలువ చేసే పరికరాల్ని.. రూ.500 కోట్లు చూపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కీలక విషయాలు త్వరలో బయటకు వస్తాయని.. అదే జరిగితే బాబు అండ్ కోకు మరో షాక్ తప్పదని.. ఈ కేసు సైతం మెడకు చుట్టుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. అధికారిక ప్రకటన వెలువడితే కానీ.. ఈ విషయం మీద క్లారిటీ రాదని చెప్పాలి.