దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, పలు రాష్ట్రాల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం అనే అజెండాతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మేరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అండ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఓవైపు ఆమె ఇలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సమయంలో పార్టీ అధికారంలో ఉన్న కీలకమైన రాష్ట్రంలో మళ్లీ లుకలుకలు తెరమీదకు వచ్చాయని అంటున్నారు. రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ ఆమె భేటీ అయి తనకు సీఎం పీఠం ఇవ్వాలని `సూచించారు`.
రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై గత ఏడాది సచిన్ పైలట్ సహా ఆయనకు మద్దతు ఇచ్చే పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవుల నుంచి సచిన్ పైలట్‌ను తొలగిస్తూ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం చర్చలు జరిపి ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా మళ్లీ సచిన్ పైలట్ తన ప్రతిపాదనను ఢిల్లీ పెద్ద ముందుంచారు.
తాజాగా ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశమైన సచిన్ పైలట్ రాజస్థాన్ వ్యవహారాల గురించి చర్చించి తన భవిష్యత్ ఎలా ఉండాలన్నన చర్చ కూడా చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. సచిన్ పైలట్ తనకు ముఖ్యమంత్రి పదవిలో పని చేయాలన్న కోరిక ఉందన్న విషయాన్ని పైలట్ అధినేత్రి సోనియా ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
కాగా, సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత సచిన్ పైలట్ విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ పటిష్ఠతపై చర్చించినట్లు పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా ఉంటూ.. తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని సోనియా సూచించినట్లు పైలట్ వెల్లడించారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్ లో వుందని, అయితే తాము కష్టపడి, సరైన మార్గదర్శనంలో వెళితే, తిరిగి కాంగ్రెస్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.