ఏపీలో మద్యపాన నిషేధం దిశగా మద్యం ధరలను బాగా పెంచి విమర్శలు ఎదుర్కొన్న జగన్ సర్కార్ తాజాగా మందుబాబులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను తగ్గిస్తూ ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రీమియం, మీడియం లిక్కర్ ధరలను 25శాతం వరకు తగ్గిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసి మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఈ తగ్గిన ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం 250-300 రూపాయల మధ్య ఉన్న మద్యం ధరలపై ప్రభుత్వం రూ.50 తగ్గించింది. దీంతోపాటు వివిధ కేటగిరిల్లో ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్ఎల్ , విదేశీ మద్యం ధరలు తగ్గాయి.
అయితే ఈ మద్యం ధరలు తగ్గించడానికి ప్రధాన కారణం.. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడమే.. పక్కరాష్ట్రాల నుంచి చీప్ మద్యం పోటెత్తుతుండడం.. ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతుండడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించి అమ్మకాలు పెంచాలని ఈ నిర్ణయం తీసుకుంది.