పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం

Update: 2021-08-29 13:33 GMT
టోక్యో పారా ఒలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మరో పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్ పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి పారాలింపిక్స్ లో రజత పథకం సాధించడమే కాకుండా తన పేరిట ఉన్న ఆసియా అత్యుత్తమ రికార్డును కూడా సమం చేశాడు.

నిషాద్ ఈ ఏడాదిలోనే 2.06 మీటర్ల హైజంప్ చేయడం ద్వారా ఆసియాలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసిన పారా అథ్లెట్ గా నిలిచాడు. ఇక ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టౌన్ సెండ్ రోడ్రిక్ 2.15 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు.

అంతకుముందు మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో ఈ ఉదయం భవీనా పటేల్ సైతం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేరోజు భారత్ ఖాతాలో రెండు రజతాలు చేరాయి.

ఇక పారా ఒలింపిక్స్ లో భారత్ కు రెండో రజతం అందించిన నిషాద్ ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. పురుషుల హైజంప్ పోటీల్లో అతడు రజతం సాధించడం సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. అత్యుద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాడని మెచ్చుకున్నారు.
Tags:    

Similar News