అయ్యా బాబోయ్ .. కరోనా తో మరో కొత్త సమస్య , ప్లేట్‌ లెట్స్‌ పడిపోతే ... ?

Update: 2021-05-27 10:30 GMT
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగానే .. రోజుకో కొత్త వ్యాధి వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్ , ఎల్లో ఫంగస్ గుబులు రేపుతుంటే .. కొత్తగా ప్లేట్‌ లెట్స్‌ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కరోనా వైరస్ ఇన్‌ ఫెక్షన్‌ ఈ సమస్యకు కారణమని తేల్చారు. బ్లడ్‌ లో తెల్ల రక్తకణాలు పడిపోతే చాలా సమస్యలు వస్తాయని డాక్డర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇలాంటి సమస్య ఎక్కువగా గుర్తించారు. ఈ సమస్య ఉన్న వారికి ప్లేట్‌ లెట్స్‌ ఎక్కించడం కూడా సాధ్యం కాదంటున్నారు.

కోల్‌ కతాకు చెందిన హెమటాలజీ అండ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ సంస్థకు చెందిన డాక్టర్లు కరోనా బాధితుల్లో ప్లేట్‌ లెట్స్‌ తగ్గుతున్న సమస్యపై అధ్యయనం చేశారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే ప్లేట్‌ లెట్స్‌ పడిపోవడానికి కారణమంటున్నారు. గతంలో డెంగీ, మలేరియా, వైరల్ ఇన్‌ ఫెక్షన్ వచ్చిన వారికి శరీరంలో ప్లేట్‌ లెట్స్ తగ్గేవి. అలాగే జన్యుపరమైన సమస్యలు ఉన్న వారిలో ఈసమస్య కనిపించేది. తాజాగా కోవిడ్‌ పేషెంట్లలో ప్లేట్‌ లెట్స్‌ లో ఈ ప్రాబ్లం కనిపిస్తోంది. స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడటం వలన ఈ సమస్య వస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. శరీరంలో ప్లేట్‌ లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ఈ కొత్త సమస్య కోవిడ్‌ బాధితులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఒక వ్యక్తిలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల ప్లేట్‌ లెట్స్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ప్లేట్‌ లెట్ల సంఖ్య పది వేలకు తగ్గే వరకు ఏ లక్షణాలు కనిపించవు. ఒకవేళ అంతకన్నా తక్కువగా పడిపోతే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేట్‌ లెట్స్‌ పది వేలకు తగ్గితేగానీ ఎక్కించకూడదు. ఒకవేళ పది వేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్‌ లెట్స్  ఎక్కించవచ్చు అని చెప్తున్నారు.
Tags:    

Similar News