కిమ్ మరో దుశ్చర్య .. బహిరంగంగా అధికారిని కాల్చి హత్య - ఏంచేశాడంటే?

Update: 2020-12-19 23:30 GMT
నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన, కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే , కిమ్ ఒక్కడే ఒకలా ఉంటాడు. ఆయనకి జాలి, దయ అనే పదాలకు తావుండదు. ఎప్పుడూ ఏదో ఒక సంఘ‌ట‌న‌తో వార్త‌ల్లో నిలిచే ఆ దేశం తాజాగా ఒక దుశ్చ‌ర్య‌కు ఒడిగట్టింది. తమ దేశానికీ చెందిన ఓ అధికారిని బహిరంగంగా కాల్చి హత్య చేయించాడు కిమ్.

దీనికి కారణం ఏంటి అంటే .. ఉత్తర కొరియాలో అక్కడ విదేశీ వస్తువులు నిషేదం. అంతేగాక విదేశాలకు చెందిన టీవీ, రేడియో చానెళ్లు ఏవీ చూడకూడదు, వినకూడదు. ప్రపంచంలో జరుగుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు అమల్లోకి తెచ్చింది. పలు రేడియోలు, టీవీ చానెళ్లపై నిషేదం విధించింది. స్థానిక పత్రికల్లో కూడా విదేశీ వార్తలు ప్రచురణ కాకూడదు. దీంతో అక్కడి ప్రజల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. ఈ సందర్భంగా వారు అక్రమ మార్గాల్లో సీడీలు, పెన్ డ్రైవ్‌ లు, మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల కంటపడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

తాజాగా ఉత్తర కొరియా ఫిష్షింగ్ బోట్‌ కు కెప్టెన్‌ గా పనిచేస్తున్న చోయ్ అనే 40 ఏళ్ల వ్యక్తిని అధికారులు బహిరంగంగా కాల్చి చంపారు. అమెరికా నిధులతో పనిచేస్తున్న రేడియో ఫ్రీ ఆసియా కథనం ప్రకారం.. ఆ దేశంలో 15 ఏళ్ల కిందటే విదేశీ రేడియో చానెళ్లను నిషేదించారు. ఎవరైన వాటిని వినేందుకు ప్రయత్నిస్తే మరణ దండన తప్పదని హెచ్చరించారు. అయితే, సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు, సైలర్లు RFA రేడియో చానెల్‌ ను వింటూ అంతర్జాతీయ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీంతో అధికారులు వీరిపై నిఘా ఉంచారు. చోయ్ ‌కు కూడా RFA రేడియో చానెల్‌ లో న్యూస్ వినడం ఇష్టం. ఒకప్పుడు ఉత్తరకొరియా సైన్యంలో రేడియో ఆపరేటర్‌గా పనిచేసిన చోయ్.. ఈ కారణంతో బాధ్యతల నుంచి తప్పించారు. సైన్యంలో ఉంటే విదేశీ రేడియోల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాడనే కారణంతో అతడిని ఫిష్షింగ్ విభాగానికి మార్చారు. అయితే, ఇది చోయ్‌ కు మరింత కలిసొచ్చింది. సముద్రంలోకి వెళ్లినప్పుడల్లా ఆ రేడియో చానెల్ వింటూ సమాచారాన్ని తెలుసుకొనేవాడు. దీనితో ఫిష్షింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వద్ద సుమారు 100కు పైగా వివిధ బోట్ల కెప్టెన్లు, మేనేజర్ల సమక్షంలో నుదుటి మీద గన్‌ పెట్టి దారుణంగా కాల్చి చంపారు. చోయ్‌ చేస్తున్న తప్పును కప్పిపుచ్చినందుకు ఆ టీమ్‌ కు చెందిన అధికారులు, సెక్యూరిటీ సిబ్బందిని సైతం విధుల నుంచి తొలగించారు.
Tags:    

Similar News