యూకేలో పుట్టుకొచ్చిన మరో మహమ్మారి

Update: 2022-02-16 02:35 GMT
ప్రపంచాన్ని ఇప్పుడు మహమ్మారులు భయపెడుతున్నాయి.  ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా ప్రపంచదేశాలకు పాకి భయపెడుతోంది. అది రూపాంతరం చెందుతూ కొత్త గా మారి విరుచుకుపడుతోంది. అది చాలదన్నట్టు ఇప్పుడు మరో జ్వరం ప్రపంచానికి పట్టుకుంది.

ఒమిక్రాన్ ఉధృతి తగ్గి.. కోవిడ్ కల్లోలం నుంచి బయటపడుతున్న వేళ యూకేలో ‘లస్సా’ రూపంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ మూడు కేసులు నమోదు కాగా.. బెడ్ ఫోర్డ్ షైర్ కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందారు. వీరందరూ ఆఫ్రికా పశ్చిమ దేశాల ప్రయాణ చరిత్ర ఉన్నవారే కావడం గమనార్హం.

లస్సా ప్రమాదకర అంటువ్యాధి.. పదేళ్లకు పైగా విరామం తర్వాత బ్రిటన్ దేశంలో ఈ వైరస్ కేసులు వెలుగుచూశాయని యూకే ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్. వో) పర్యవేక్షిస్తోంది.

-ఏమిటీ ‘లస్సా’ వైరస్ ఫీవర్

అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం.. ‘లస్సా’ జ్వరం తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్. చిట్టెలుకల్లోని ఓ జాతి అయిన ‘మల్టీమమ్మెత్ ర్యాట్’ నుంచి వ్యాపిస్తుంది. దీని బారినపడిన ఎలుకలు జీవితాంతం మూత్రం ద్వారా వైరస్ ను విడుదల చేస్తాసయి. ఈ విసర్జితాలు పడిన వస్తువులను తాకడం ద్వారా మనుషులు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది.  ఇలాంటి వారి నుంచి వేరే వారికి ఇది వ్యాపిస్తోంది.

ఇది అరెనా విరిడే కుటుంబానికి చెందిన సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్. పశ్చిమ ఆఫ్రికా దేశాలైన సియెర్రా లియోన్, గినియా, నైజీరియాల్లో గతంలో లస్సా కేసులు నమోదయ్యాయి. ఆ దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎండెమిక్ దశలో ఉంది.

-లస్సా వైరస్ లక్షణాలు

లస్సా వైరస్ గురైన రోగిలో వారం నుంచి మూడు వారాల్లో లక్షణాలు బయటపడుతాయి. 80శాతం మందిలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. మిగిలిన 20శాతం మందిలో మాత్రం చిగుళ్లు, కళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతూ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. శ్వాస ఇబ్బందులు, తరచూ వాంతులు, ముఖం వాపు, ఛాతీ, వెన్ను, పొట్టలో నొప్పి, విభ్రమ లక్షణాలు కనిపిస్తాయి. వినికిడి శక్తి కోల్పోవడం.. వణుకు, మెదడు వాపు సహా నాడీ సంబంధ సమస్యలు వస్తాయని సీడీసీ తెలిపింది.

లస్సా జ్వరం సోకిన వారిలో 1శాతం మరణాలకు అవకాశం ఉందని డబ్ల్యూ.హెచ్.వో పేర్కొంది. ఈ కేసుల్లో ఇప్పటివరకూ 15 మరణాలున్నాయి.
Tags:    

Similar News