దాచేప‌ల్లిలో మ‌రో బాలిక‌పై అత్యాచారం

Update: 2018-05-12 17:41 GMT
అభం శుభం తెలియని బాలికపై దాచేపల్లిలో ఈనెల మొద‌టివారంలో అఘాయిత్యం జరిగిన ఘ‌ట‌న అంద‌రినీ క‌లిసి వేసిన సంగ‌తి తెలిసిందే. ముక్కుప‌చ్చ‌లార‌ని పసిపిల్ల మాన‌వ‌మృగం ఆకృత్యాల‌కు బ‌లైన తీరు అంద‌రినీ కంట త‌డిపెట్టించింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు జరగాయి. పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించగా...నిందితుడు చేయకూడని నేరం చేశానంటూ పశ్చాత్తాపంతో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  మైనర్‌ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మ‌రువ‌క ముందే అదే త‌ర‌హాలో దాచేప‌ల్లిలో ఇంకో ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే అలాంటిదే మరో దారుణం దాచేప‌ల్లిలో వెలుగుచూసింది.  55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. 13ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారానికి ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది.  ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇదిలాఉండ‌గా...నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. 65 ఏళ్ల గురుస్వామి అనే వ్యక్తి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు . చిరుతిళ్లు ఇప్పిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప నానమ్మ చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గురుస్వామికి దేహశుద్ధి చేశారు. గురుస్వామిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఆ పని చేయలేదని గురుస్వామి వెల్ల‌డించాడు.
Tags:    

Similar News