అప్పట్లో మోడల్.. ఇప్పుడు కుంభమేళాలో హైలెట్

ఇదిలా ఉండగా.. తాజాగా జరుగుతున్న కుంభమేళాకు వస్తున్న సాధువుల్లో ఒక మిళా సాధ్వి అందరిని తెగ ఆకర్షిస్తున్నారు.

Update: 2025-01-16 04:18 GMT

ప్రపంచం మొత్తం అని చెప్పలేం కానీ దేశం మొత్తం ఇప్పుడు ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా వైపు చూస్తోంది. అక్కడే జరిగే విశేషాల గురించి.. కుంభమేళకు వచ్చే వారికి సంబంధించిన మీడియా కవరేజ్ పట్ల విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా జరుగుతున్న కుంభమేళాకు వస్తున్న సాధువుల్లో ఒక మిళా సాధ్వి అందరిని తెగ ఆకర్షిస్తున్నారు. దీనికి కారణం.. పూర్వ రంగంలో ఆమె మోడల్ కావటమే. ప్రస్తుతం రుద్రాక్ష మాల.. పువ్వుల మాల మాట ధరించి నుదిటి మీద తిలకంతో చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆమె కోసం జాతీయ మీడియా మొదలు స్థానిక మీడియా వరకు విపరీతంగా ఇంటర్వ్కూలను అడుగుతున్నారు.

సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కుంభమేళలో సాధ్విగా పాపులర్ అవుతున్న ఆమె పేరు హర్ష రిచార్య. 1994 మారచి 26న మధ్యప్రదేశ్ లో పుట్టిన ఆమె మోడల్ గా.. యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లెయెన్సర్ గా.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ లోనూ హోస్టుగా వ్యవహరించారు.

దేశీయంగా జరిగే వెడ్డింగ్స్ లో మాత్రమే కాదు విదేశాల్లో జరిగే ఈవెంట్స్ లోనూ ఆమె డీల్ చేసేవారు. అయితే.. అలాంటి ఆమె.. ఆ తర్వాత ఏమైందో కానీ రెండేళ్ల క్రితం తాను చేస్తున్నపనులకు పుల్ స్టాప్ పెట్టేసి.. ఆధ్యాత్మిక మార్గంలోకొత్త జీవితాన్నిస్టార్ట్ చేశారు. ఈ 30 ఏళ్ల సాధ్వి రెండేళ్లుగా పూర్తి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు పరిమితం అయ్యారు.

తనను తాు నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీకైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలిగా ఆమె తన గురించి చెప్పుకుంటున్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్మాత్మిక జీవితాన్ని షురూ చేసినట్లుగా పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News