కరోనాకు మరో చెక్.. కొత్త యాంటీబాడీలు రెడీ
ప్రపంచాన్ని ఆవహించిన కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలంతా ఆపసోపాలు పడుతున్నారు. ఎంతసేపు వ్యాక్సిన్ గురించే పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు మనుషుల్లో సహజంగా కరోనాను ఎదుర్కొంటున్న కరోనా యాంటీబాడీలపై దృష్టి సారించడం లేదు.
ప్రస్తుతం కరోనాను జయించిన వారి ప్లాస్మాలో ఈ యాంటీబాడీస్ తయారు అవుతున్నాయి. వాటినే వ్యాక్సిన్ గా మార్చి అందరికీ ఎక్కిస్తే అసలు కరోనా అన్నదే ఉండదు కదా అని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది.
వైరస్ ను ఎదుర్కొనే శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే యాంటీబాడీలపై ఈ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో కొన్ని ఇతరుల కంటే శక్తిమంతంగా ఉన్నాయని... కరోనాను ఖతం చేస్తున్నాయని గుర్తించారు.
సాధారణంగా మన శరీరంలోని బీ-కణాలు యాంటీబాడీలు తయారు చేస్తుంటాయి. ‘ఐజీహెచ్.వీ3-53’ అనే జన్యువు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్ ను ఇవి అత్యంత సమర్థంగా మట్టుబెడుతున్నాయని గుర్తించారు. ఈ యాంటీబాడీలు ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజల్లోనూ కొద్ది మోతాదులో ఉన్నాయని గుర్తించారు. వీటి సంఖ్యను పెంచేలా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కరోనా వైరస్ ను ఖతం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త పరిశోధన కరోనాపై బ్రహ్మాస్త్రంలా పనిచేయస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.