బీజేపీతో ఓకే.. నితీష్ నాట్ ఓకే.. ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఎల్జేపీ

Update: 2020-10-04 17:33 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో విభేదాలు బయటపడ్డాయి. తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేల ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన చేశారు.

ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి తాము ఎన్నికలకు వెళ్లమని ఎల్జేపీ తేల్చిచెప్పింది. బీజేపీతో భాగస్వామిగా ఉంటాం కానీ.. బీహార్ లో నితీష్ తో కలవమంటూ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ప్రధాని మోడీ నాయకత్వానికి మాత్రం మద్దతునిస్తామని ప్రకటించారు.

చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన ఆదివారం ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగింది. బీజేపీకి కూటమికి మద్దతుగా.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలు పనిచేస్తారని ఈ సమావేశంలో తీర్మానించారు.

కాగా బీహార్ లో మాత్రం ఇప్పటికే సీఎం నితీష్ సారథ్యంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నారు. అయితే ఇందులో ఇన్నాళ్లు ఉన్న ఎల్జీపీ మాత్రం బయటకు వచ్చింది. ఎల్జీపీ సొంతంగా బీహార్ లో పోటీచేస్తుందని.. అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ లో అక్టోబర్ 28 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.







Tags:    

Similar News