కొద్దిరోజుల క్రితం సంచలనంగా మారిన మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు కావటం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని సంగం జాగర్లమూడిలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సంగం డెయిరీలో పలు అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఆయన అరెస్టు కావటం.. కోర్టు ఆయనకు రిమాండ్ విధించటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సంగం డెయిరీకి సంబంధించిన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాటు.. డెయిరీ యాజమాన్యాన్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకొని అక్కడి పరిస్థితుల్ని ఆరా తీశారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాల్లో ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికి.. సంగం డెయిరీ లోటుపాట్లపై మరింత పట్టు సాధించేందుకే అన్న మాట వినిపిస్తోంది.
సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులు అరెస్టు చేయటంతో పాటు.. ఐదు రోజులుగా సంగం డెయిరీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డెయిరీ వ్యవహారాలపై ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సాగుతోంది.ఈ క్రమంలోనే.. తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం.. వెలువరించిన ఆదేశాలు ధూళిపాళ్ల నరేంద్రకు షాకిచ్చేవన్న మాట వినిపిస్తోంది.