రైతు కొడుకు రైతు కావాలనే కాన్సెప్ట్ తో తాజాగా శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా వచ్చింది. అయితే రైతు కొడుకు రైతు కావడం అంత ఈజీ కాకున్నా రాజకీయాల్లో వారసులు మాత్రం కంపల్సరీగా వస్తుంటారు. వైఎస్ఆర్ కు జగన్, కేసీఆర్ కు కేటీఆర్, చంద్రబాబుకు లోకేష్ లు ఎలాగూ తెరపైకి వచ్చారు. ఇప్పుడు తిరుపతి బరి నుంచి మరో కొత్త యువకుడు తెరపైకి వచ్చాడు.
తిరుపతిలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు. అయితే ముందుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ గా ఎన్నికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడిగా కొడుకును తిరుపతి ఎమ్మెల్యే బరిలో నిలిపే ప్లాన్ లో కరుణాకర్ రెడ్డి ఉన్నాడట.. ముందస్తుగా తిరుపతి డిప్యూటీ మేయర్ గా దించుతున్నాడట..
తిరుపతి కార్పొరేషన్ లోని 4వ డివిజన్ నుంచి ఇప్పటికే భూమన అభినయ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి కొడుకును మేయర్ చేద్దామనుకున్నా వైసీపీ అధిష్టానం బీసీ మహిళను కార్పొరేషన్ మేయర్ చేయాలని డిసైడ్ కావడంతో వెనక్కి తగ్గారు. తిరుపతిలో బీసీలు, బలిజలు, బ్రాహ్మాణుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో వారికే పీఠం ఇవ్వబోతున్నారు.
నిజానికి తిరుపతి మేయర్ పోస్టు జనరల్ ఉన్నా.. జగన్ నిర్ణయానికి అనుగుణంగా బీసీలకు ఇచ్చి కొడుకును డిప్యూటీ మేయర్ గా చేయబోతున్నాడట భూమన.. దీనివల్ల భవిష్యత్తులో పార్టీ గుర్తింపు దక్కుతుందని ఆయన భావిస్తున్నాడు. ఇక మేయర్ బరిలో వైసీపీ నుంచి డాక్టర్ జల్లి శిరీష, అనిత మధ్యే పోటీ ఉందని అంటున్నారు. శిరీష వైపే ఎమ్మెల్యే భూమన మద్దతు ఉందని చెబుతున్నారు.