కశ్మీర్ లో మరో ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. భారత వైమానిక దళం స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. రెండు డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు వెనక్కి తగ్గాయి. కశ్మీర్ లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రత్నుచక్ కలుచక్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. డ్రోన్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో భూభాగంపై అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని తెలిపారు. మన సైనిక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రత్నుచక్ కలుచక్ మిలటరీ స్టేషన్ పై 2002లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 31 మంది మరణించారు. అలాగే 48 మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగినప్పటి నుంచి రత్నుచక్ కలుచక్ సైనిక స్థావరానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్ ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్ లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్ లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్ రేంజి ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. దాడికి ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ తో కూడిన పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో బాంబులను జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బంది గాయపడ్డారు. ఈ బాంబుల్లో ఆర్డీఎక్స్ తోపాటు మిశ్రమ రసాయనాలు ఉన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి.