పోలీసులు తేల్చరు..వివేకా కేసు తేలదు. అభియోగాలు చేస్తున్న వారిని కూడా అనుమానిస్తూ మరో కొత్త వింత చోటు చేసుకుంది. దీంతో డాక్టర్ సునీత తో సహా ఆమె భర్త కూడా ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ప్రధాన నిందితుడు శంకర్ రెడ్డి భార్య సీన్ లోకి వచ్చారు. ఓ విధంగా ఆమె ఇప్పటికే పులివెందుల కోర్టులో సునీతపైనే ఓ పిటిషన్ వేశారు. తాజాగా ఓ ప్రయివేటు కేసు ఫైల్ చేశారు. ఆ వివరం ఈ కథనంలో.
వైఎస్ సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరో ఆసక్తిదాయక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడి భార్య అనుకోని విధంగా ఓ ప్రయివేటు కేసు ఫైల్ చేశారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం అవుతోంది. వివేకా హత్య కేసు ఏళ్లకు ఏళ్లు నెట్టుకుంటూ వస్తున్న సీబీఐకి తాజా పరిణామం మింగుడుపడే విధంగా లేదు. మరోవైపు కేసు పురోగతిలో ప్రభుత్వ సహకారం కూడా లేదు అని తేలిపోయిందని తెలుస్తోంది. కానీ అధికార పార్టీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పడమే తప్ప వాస్తవాలు వెలుగులోకి రానివ్వడం లేదు అని కూడా తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఓ ప్రయివేటు కేసు ఫైల్ చేశారు. ఇందులో నిందితులుగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేర్లను చేర్చి ఈ కేసు ఫైల్ చేయడం ఆసక్తి రేపుతోంది.
వివేకా హత్య కేసులో వాళ్లనే ప్రధాన అనుమానితులుగానూ, నిందితులుగానూ చూడాలన్నది తులసమ్మ అభియోగం. వాస్తవానికి వివేకా రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ ఇంట వివాదాలు రేగుతున్నాయని తెలుస్తోంది. అవే హత్యకు కారణం అయి ఉంటాయని తులసమ్మ ఆరోపణ.
తులసమ్మ గతంలోనూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఆయన అల్లుడు, చిన బావమరిది రాజ శేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డితో పాటు కొమ్మా పరమేశ్వర రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైజీ రాజేశ్వర రెడ్డి, నీరుగట్టు ప్రసాద్ పై అభియోగాలు మోపారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత వాదన గతంలో వేరేవిధంగా ఉండేది. కేసు కారణంగా తనకు ఆత్మ రక్షణ లేదని, తక్షణమే తనకు రక్షణ కల్పించాలని ఏపీ సర్కారును వేడుకున్న విధంగా కూడా కొన్ని వీడియోలు వచ్చాయి.
అయితే సొంత అన్న ఇలాకాలో ఆమె ఈవిధంగా కన్నీరు పె ట్టుకుంటూ మాట్లాడడం కూడా సంచలనం అయింది. ఇక ఈ కేసులోనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయరు అని కూడా గతంలో విపక్షం ప్రశ్నాస్త్రాలు సంధించింది. వీటిపై కూడా వైసీపీ స్పందించిన దాఖలాలేవీ లేవు. మూడేళ్లుగా నడుస్తున్న కేసులో ఇప్పటిదాకా అప్రూవర్ గా మారిన దస్తగిరి (డ్రైవర్ ) అదేవింగా వివేకా పీఏ ఇనాయతుల్లా చెప్పే మాటలే కీలకం కానున్నాయి.