చోక్సీ అరెస్ట్‌ లో మరో ట్విస్ట్.. భారత్ కి అప్పగించరా, సుప్రీం ఏం చెప్పబోతోంది ?

Update: 2021-05-28 04:30 GMT
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్‌ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెహుల్ చోక్సీ భారత పౌరుడే కాదని, ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరుడని ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ వాదిస్తున్నాడు. చోక్సి కి  ప్రస్తుతం భారత పౌరసత్వం  లేదు కాబట్టి ఇండియాకు పంపించడం సాధ్యం కాదని చెప్తున్నారు. డొమినికాలో అరెస్టైన చోక్సీని అక్కడి నుంచి నేరుగా ఇండియాకు తరలించాలని డొమినికా ప్రభుత్వాన్ని అంటిగ్వా అండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ కోరిన నేపథ్యంలో , చోక్సీ లాయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డొమినికా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చటోపీ పెట్టిన మెహుల్ చోక్సీ.. గత ఆదివారం ఆంటిగ్వాలో ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు. ఆయన కోసం ఇంటర్ పోల్ వెతుకుతున్న క్రమంలోనే పక్క దేశం డొమినికాలో అరెస్ట్ అయ్యారు. సముద్రంలో ఏవో పత్రాలు విసిరేస్తూ అక్కడికి పోలీసులకు చిక్కాడు. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారన్న ఆరోపణలలతో డొమినికా పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. ఒక పడవలో సముద్ర మార్గం ద్వారా డొమినికాకు పారిపోయి ఉంటారని ఇరుదేశాల అధికారులు భావిస్తున్నారు. మెహుల్ చోక్సీని భారత్‌ కు అప్పగిస్తామని ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’ ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఇది వరకే తెలిపారు. ఆయన్ను ఆంటిగ్వాకు పంపిచకుండా నేరుగా భారత్‌ కు అప్పగించాలని డొమినికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెహుల్ చోక్సీని మళ్లీ మాదేశంలోకి రానివ్వం. ఇక్కడి నుంచి వెళ్లి ఆయన చాలా పెద్ద తప్పు చేశారు. డొమినికా ప్రభుత్వం మాకు సహకరిస్తోది. మెహుల్ చోక్సీని అప్పగిస్తామని భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాం అని తెలిపారు.

అయితే ,మేహుల్ చోక్సీ, ఏ దేశం నుంచి డొమినికాకు చేరుకున్నాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వేన్ మార్ష్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆంటిగ్వా నుంచి వచ్చినందున, ఆ దేశానికే అప్పగించాలని కోరారు. మేహుల్ చోక్సీ భారతీయుడు కాదని తన పిటీషన్‌ లో స్పష్టం చేశారు. ఆంటిగ్వా పౌరసత్వం ఉన్నందున, ఆ దేశ రాజ్యాంగం, చట్టాలన్నీ చోక్సీ వర్తిస్తాయని, తమదేశ పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని వాదించారు. దీన్ని విచారణకు స్వీకరించిన అక్కడి సుప్రీంకోర్టు, అప్పగింత ప్రయత్నాలపై స్టే జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. చోక్సీ శరీరంపై కొట్టిన, కాలిన గాయాలు ఉన్నాయని వేన్ మార్ష్ తెలిపారు. చోక్సీని ఆంటిగ్వాకు అప్పగించబోతోన్నారంటూ మొదట్లో వచ్చిన వార్తలను డొమినికా పోలీసులు తోసిపుచ్చారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ తమ ఆధీనంలోనే ఉంటారని తెలిపారు.
Tags:    

Similar News