మరో 'టీకా' సిద్ధం .. డీఆర్‌డీఓ ‘2-డీజీ’కి డీసీజీఐ ఆమోదం !

Update: 2021-05-08 12:30 GMT
దేశంలో రోజురోజుకి కరోనా జోరు పెరిగిపోతుంది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ఎంత వేగంగా కొనసాగిస్తున్నా కూడా కరోనా జోరు మాత్రం తగ్గడం లేదు. రోజుకి నాలుగు లక్షల కేసులు, మూడు వేలకిపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ మూడు వ్యాక్సిన్లకు దేశంలో అనుమతి లభించింది. తాజాగా కరోనాపై పోరుకు, మ‌రో టీకాకి ఆమోదం లభించింది. ఈ టీకాను డీఆర్‌ డీఓ రూపొందించింది. డీఆర్డీవో త‌యారు చేసిన 2-డీజీ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్  డీసీజీఐ ఆమోదం తెలిపింది.

ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని , క‌రోనా పేషెంట్ల‌కు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇది జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్ప‌త్తి చాలా సులువ‌ని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఇది వాడిన పేషెంట్ల‌లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ లో నెగ‌టివ్‌ గా తేలిన‌ట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఈ డ్ర‌గ్ పొడి రూపంలో ఉండి, సాచెట్‌ ల‌లో వ‌స్తుంది. దీనిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగితే చాలు. ఇది వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్డీవో తెలిపింది. డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌ తో క‌లిసి డీఆర్డీఓ ల్యాబ్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇది క‌రోనా బాధితులు త్వరగా కోలుకోవ‌డంలో స‌హ‌క‌రిస్తోంద‌ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో వెల్లడైంది. అలాగే కరోనా బాధితులకి ఆక్సిజన్ అవసరం లేకుండా చేయడంలో తోడ్పడుతుంది.
Tags:    

Similar News