దేశప్రజల చూపును తనవైపు తిప్పుకొనేలా ఢిల్లీ రాజకీయాలు సాగుతున్నాయి. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అదే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన మరోసారి సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది. అయితే తనతోపాటు ఇతర అధికారులపై చేయి చేసుకోమని హామీ ఇస్తేనే వస్తానని అన్షు ప్రకాశ్ సీఎంకు ఓ లేఖ రాసి కలకలం సృష్టించారు.
ఈ నెల 19న కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో తనపై దాడి జరిగిందని అన్షు ప్రకాశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ డేట్లను ఫైనలైజ్ చేయడానికి ఈ సమావేశం నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సీఎస్ చెప్పారు. `ఢిల్లీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాలతోనే అది సాధ్యం. అందుకే దానికి సంబంధించిన తేదీలు ఫైనల్ చేయడానికి నేను, మా ఇతర అధికారులు సమావేశానికి వస్తున్నాం. అయితే మాపై ఎలాంటి దాడి జరగదని సీఎం హామీ ఇస్తేనే వస్తాం `అని సీఎస్ అన్షు ప్రకాశ్ ఆ లేఖలో స్పష్టం చేశారు. సమావేశం సజావుగా - హుందాగా సాగాలని కూడా ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు.
ఇదిలాఉండగా...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు దాడిచేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారిక సమావేశాలను ఇకపై ప్రత్యక్ష ప్రసారంలో నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ యోచిస్తోంది. అధికారిక సమావేశాలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాల వీడియోను ప్రభుత్వ వైబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఆలోచనకు ఆమోదం లభిస్తే వచ్చేబడ్జెట్ లో ఇందుకు నిధులు కేటాయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అధికారిక సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారమైతే అక్కడ ఏం జరుగుతుందో, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు తెలిసిపోతుంది అని ఆయన వెల్లడించారు. అలాగే ఫైళ్ల కదలిక ప్రక్రియను కూడా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫైల్ ఎక్కడున్నది? ఏ అధికారి ఫైళ్లను త్వరగా చూస్తున్నారు? ఏ అధికారి ఎక్కువకాలం అంటిపెట్టుకుంటున్నారు? ప్రభు త్వం ఏమైనా ఆపుతున్నదా? వంటి అంశాలు ప్రజలకు తెలుస్తాయని అధికారి వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేల దాడి వివాదం సమసిపోలేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సీఎస్‌పై దాడి చేసినందుకు ఆ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.