అట్టుడికిన పాతబస్తీ.. చార్మినార్ వద్ద ఉద్రిక్తం

Update: 2019-12-20 11:22 GMT
పౌరసత్వ సవరణ చట్టంపై హైదరాబాద్ లోని పాతబస్తీ అట్టుడుకింది. శుక్రవారం కావడం.. ముస్లింలు పెద్ద ఎత్తున చార్మినార్ వద్దగల మక్కామసీదుకు ప్రార్థనలకు వచ్చారు. ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు చేరుకున్న ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.

బీజేపీ, కేంద్రంలోని మోడీషాలకు వ్యతిరేకంగా వందలాది మంది ముస్లింలు చార్మినార్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేశారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

యువకులు మోడీషాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పలు ఆస్తులు ధ్వంసం చేశారు. పోలీసులతో వాగ్వాదం తోపులాట జరిగింది.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ చట్ట సవరణ ఆందోళనలు హైదరాబాద్ లోనూ మొదలు కావడంతో పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Tags:    

Similar News