జగన్ గ్రాఫ్.. @ 2024.. తగ్గేదేలే.. అంటూ తగ్గిన చరిత్ర.. !
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగులు వేయనున్నాం. సహజంగానే.. గత కాలపు అనుభ వాలను మననం చేసుకోవడం.. ఎవరికైనా ముఖ్యమే.
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగులు వేయనున్నాం. సహజంగానే.. గత కాలపు అనుభ వాలను మననం చేసుకోవడం.. ఎవరికైనా ముఖ్యమే. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు.. భవిష్యత్తుకు దోహదపడతాయి. సో.. ఈ క్రమంలో 2024లో వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ ఎలా ఉందనేది ఆసక్తికరం. ప్రధానంగా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇది పెద్ద విషయం కాదు! నిజమే. గెలుపు ఓటములు అనేవి సహజంగానే జరుగుతుంటాయి.
కానీ.. ప్రధానంగా చూసుకుంటే.. గెలుపు/ ఓటమిని మించి.. జగన్ చాలానే కోల్పోయారు. ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. 2 లక్షల వేల కోట్ల రూపాయలకు పైగానే తాను ప్రజలకు పంచానని చెప్పుకొన్న ఆయన దీని ని ప్రచారంలో చేసుకోవడంలో విఫలమయ్యారన్న సీనియర్ నాయకుల కామెంట్లకు ఆయన చెక్ పెట్టలేక పోయారు. తన సోదరి షర్మిల.. తీవ్ర యాంటీ ప్రచారం.. దీనికితోడు, సొంత బాబాయి హత్యపై జరిగిన యాగీ వంటివి కూడా.. జగన్ చెక్ పెట్టలేక పోయారు.
``తగ్గేదేలే`` అంటూనే.. ఆయన ఈ ఏడాది తగ్గాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు .. ఉన్న బీరం.. ఇప్పు డు లేకుండా పోయింది. ఎవరు పోయినా ఫర్వాలేదు.. అనే టాక్ నుంచి ఉండండి! అనే వరకు పరిస్థితి కొంత యూటర్న్ తీసుకుంది. ఇక, ఈ ఏడాది తొలి నాలుగు మాసాల్లో తమకు తిరుగులేదని అనుకున్నప్ప టికీ.. తర్వాత మారిన పరిస్థితులు మాత్రం ఇబ్బందులు పెట్టాయి. వీటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగడంలో జగన్ విఫలమయ్యారు.
ఇక, పార్టీలో సీనియర్లు జెండా వదిలేస్తున్నా.. ధీరత్వం ప్రదర్శించారు. కానీ, కూసాలు కదలిపోతున్నాయని గ్రహించిన తర్వాత.. తగ్గాల్సి వచ్చింది. కడప కార్పొరేషన్‌పై కత్తి వేలాడుతున్న పరిస్థితిని కొని తెచ్చు కున్నారు. నేతలు జైళ్లకు వెళ్లడం.. వారిని రక్షించుకునే ప్రయత్నాలు పెద్దగా లేకపోవడం.. ప్రజల్లో తిరోగ మన ఫలితం వంటివి.. జగన్ ఈ ఏడు..తగ్గేదేలే అనుకున్నా.. తగ్గాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఎవరూ.. చెప్పి చేయరు.. అన్నట్టుగా ఎప్పుడు ఎవరు ఉంటారో.. పోతారో తెలియని పరిస్థితి. సో.. ఇప్పుడు వీటిని అధ్యయనం చేసి.. భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం జగన్‌కు ఏర్పడింది. మరి ఏం చేస్తారో చూడాలి.