నాగబాబు పాలిటిక్స్ : అక్కడా...ఇక్కడా ?

అయితే నాగబాబుకు ఈ పదవుల విషయంలో ఏదో తెలియని దోబూచులాట కూడా సాగుతోంది. అందుకే ఇంతటి చర్చ.

Update: 2025-01-30 19:30 GMT

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కొణిదెల నాగబాబు రాజకీయం ఎలా సాగుతోంది అన్నదే చర్చ ఇపుడు. ఆయనకు ఏ పదవి వరిస్తుంది, ఎక్కడ ఆయన ప్రమాణం చేస్తారు ఇదే ఇపుడు హాట్ టాపిక్. నాగబాబు కోరుకుంటే పదవులకు లోటా అన్నది కూడా ఉంది. అయితే నాగబాబుకు ఈ పదవుల విషయంలో ఏదో తెలియని దోబూచులాట కూడా సాగుతోంది. అందుకే ఇంతటి చర్చ.

నాగబాబు నిజానికి ఈపాటికి అనకాపల్లి నుంచి లోక్ సభకు సభ్యుడు అయి తీరాలి. ఆయన దానికి తగినట్లుగా గత ఏడాది అన్నీ చూసుకుని ఏకంగా ఆఫీసు కూడా ప్రరంభించుకునే సన్నాహాలు చేసుకున్న వేళ సడెన్ గా పొలిటికల్ మూవ్ అన్నది జరిగింది. అలా ఆ సీటు బీజేపీ ఖాతాలో సీఎం రమేష్ కి వెళ్ళిపోయింది.

దాంతో నాగబాబు ఇంతటి కూటమి ప్రభంజనంలో కూడా ఏ పదవీ అందుకోలేకపోయారు అని అంటారు. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడి ఎనిమిది నెలలు గడచాయి. కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో పాటు ఎమ్మెల్సీ పదవులు రాజ్యసభ ఎంపీ పదవులు ఇటీవల భర్తీ అయ్యాయి. కానీ నాగబాబుకు చాన్స్ అయితే దక్కలేదు.

ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లుగా స్వయంగా కూటమి ప్రభుత్వ పెద్ద చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో మినిస్టర్ నాగబాబు అని అంతా అనుకున్నారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఏమీ జరగలేదు. అయితే మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవులలో ఒకటి నాగబాబుకి ఇచ్చి చట్ట సభలో అడుగు పెట్టించి ఆ మీదట మంత్రిగా చేస్తారు అని వార్తలు వచ్చాయి.

దాంతో మరికొంత వెయిటింగ్ తప్పదని మెగా అభిమానులు అనుకుంటున్న వేళ సడెన్ గా మరో రాజకీయ కుదుపు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడంతో ఒక ఖాళీ అనూహ్యంగా వచ్చింది. దాంతో ఈ సీటు విషయంలో నాగబాబు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగింది. ఇక దానికి చంద్రబాబు పవన్ కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు.

ఎందుకంటే నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కంటే జాతీయ రాజకీయాలలో ఆయనను ఉంచడం ద్వారా పార్టీకి మేలు అని పవన్ తలుస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేనకు ఇప్పటిదాకా రాజ్యసభ కోటాలో సీటు ఇవ్వలేదు. బీజేపీ టీడీపీ మాత్రం గత మూడు ఎంపీ సీట్లను షేర్ చేసుకున్నాయి. దాంతో న్యాయంగా ఈ సీటు జనసేనకు వెళ్ళాల్సిందే అన్న చర్చ బయల్దేరింది.

దాంతో నాగబాబుకు రాజ్యసభ సీటు వదిలేయాలని బీజేపీని జనసేన టీడీపీ కోరబోతున్నాయని అంటున్నారు. అయితే తాము రాజ్యసభలో బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో ఇది సాధ్యమేనా అన్న చర్చ ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామా తరువాత బీజేపీ ప్రముఖుడికి ఈ సీటు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. కానీ ఇపుడు జనసేన రేసులోకి వచ్చింది.

దాంతో బీజేపీ ఏమంటుంది ఈ ప్రతిపాదన మీద ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చర్చగా ఉంది అయితే జనసేనతో మంచి రిలేషన్స్ బీజేపీకి ఉన్నందువల్ల పట్టుబడితే కాదనదు అన్న మాట కూడా ఉంది. ఇక చూస్తే ఈ పదవి ఏకంగా మూడున్నరేళ్ళ పాటు ఉంటుంది. అంటే 2028 జూన్ 21 దాకా అన్న మాట. ఆ తరువాత ఎటూ ఏపీతో పాటు లోక్ సభకు ఎన్నికలు వస్తాయి. అంటే ఈ పదవిలో నాగబాబు కుదురుకుంటే మళ్ళీ ఎన్నికల దాకా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అపుడు ఆయన కోరుకున్న చోట లోక్ సభకు బరిలో దిగవచ్చు అని అంటున్నారు. అయితే బీజేపీ చేతిలోనే ఇపుడు నాగబాబు సీటు విషయం ఉంది అని అంటున్నారు.

దాంతో నాగబాబు ఏ పెద్దల సభకు వెళ్తారు అన్న ధర్మ సందేహం తలెత్తుతోంది. ఆయన ఎమ్మెల్సీగా ఇక్కడ ఉంటారా అలా పదవి తీసుకుని రాష్ట్ర మంత్రి అవుతారా లేక రాజ్యసభకు నెగ్గి కేంద్రంలో మంత్రి అవుతారా అన్నది బిగ్ డిబేట్ పాయింట్ గా ఏపీ రాజకీయాల్లో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. సో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News