వైరల్ వీడియో: రూ.70 కోట్లు టేబుల్ పై వేసి... బోనస్ ఇలా కూడా ఇస్తారా?

అయితే తాజాగా ఓ యజమాని రొటీన్ కి భిన్నంగా ఆలోచించారు. నోట్లను కుప్పలుగా వేయించి తీసుకోమన్నారు!

Update: 2025-01-30 18:30 GMT

ఉద్యోగులకు బోనస్ లు వారి వారి వేతనాల్లో కొంత శాతంగా లెక్కించి ఇస్తారని.. అది కూడా నెల నెలా ఇచ్చే జీతాల మాదిరిగానే ఏడాదికి ఒకసారి బ్యాంక్ అకౌంట్ లో కొంతమందికి వేస్తే.. చెక్ ల రూపంలో మరికొంతమందికి ఇస్తారనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా ఓ యజమాని రొటీన్ కి భిన్నంగా ఆలోచించారు. నోట్లను కుప్పలుగా వేయించి తీసుకోమన్నారు!

అవును... తన సంస్థలోని ఉద్యోగులకు బోనస్ లు ఇచ్చే విషయంలో చైనా దేశానికి చెందిన ఓ యజమాని రొటీన్ కి భిన్నంగా ఆలోచించారు. ఇందులో భాగంగా... తన కంపెనీలోని వర్కర్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయేలా బోనస్ ఇచ్చే విధానాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

దీంతో.. మనకూ ఇలాంటి బాస్ ఉంటే బాగున్ను అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అంతలా జనాలకు ఆసక్తికలిగించేలా ఆ సంస్థ యజమాని ఏమి చేశాడంటే... నోట్ల కట్టలను కుప్పలుగా వేయించి.. 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించారు. ఇలాంటి ఆలోచన చేసిన సంస్థ యజమాని ఎవరా అనే చర్చ మొదలైంది.

చైనాలోని హెనాన్ మైనింగ్ క్రేన్ కో లిమిటెడ్ అనే సంస్థ యజమాని.. బోనస్ ను అందరికీ సర్ ప్రైజ్ గా ప్రకటించారు. ఇందులో భాగంగా... పొడవాటి టేబుల్ పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, ఉద్యోగులకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉద్యోగులంతా డబ్బు లెక్కించేందుకు పోటీ పడ్డారు.

దీంతో... చైనా వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Tags:    

Similar News