మోడీ వ్య‌తిరేక ప్ర‌చారం.. 8 యూట్యూబ్ ఛానెళ్ల‌పై వేటు

Update: 2022-08-18 08:30 GMT
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం పేర్కొంది.బ్లాక్‌ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్‌ పాకిస్తాన్‌కు చెందినది కావ‌డం విశేషం.

ఇదిలా ఉండగా.. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్‌ చేసింది. ఇక, గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఇక, ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.  

తాజాగా బ్లాక్‌ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్‌.. దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్‌ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

విమ‌ర్శ‌లు ఇవీ..అయితే.. కేంద్రం చెబుతున్న వాద‌న‌లో ప‌స లేద‌ని.. మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. కేవ‌లం ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా వ‌స్తున్న వార్త‌లు, విశ్లేష‌ణ‌ల‌పై క‌న్నెర్ర చేసే క్ర‌మంలోనే ఇలా జాతీయ భ‌ద్ర‌త అనే క‌త్తి దూశార‌ని.. మీడియా వ‌ర్గాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రి దీనిపై ప్ర‌తిప‌క్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News